బహుజన రాజ్యాధికారం కోసం పోరాడుదాం జె కె అర్ పిలుపునిచ్చారు

Aug 11, 2024 - 19:49
 0  3
బహుజన రాజ్యాధికారం కోసం పోరాడుదాం జె కె అర్ పిలుపునిచ్చారు

తెలంగాణ వార్త  బహుజన రాజ్యాధికారం కోసం పోరాడుదాం కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ జే కే ఆర్ గారి పిలుపు * ఓట్లు మనయే. ఇకపై సీట్లూ మనయే. బానిసత్వం వదిలేద్దాం. మన ఓట్లు మనం వేసుకుందాం. * మన బతుకులు మార్చు కుందాం. * ఓటు చైతన్యమే మన బతుకు బాట. * భావితరాలకు బంగారు బాట. ఓట్ల మార్పిడే చేసుకుందాం. * ఎదగని కులాలను ఎదగనిద్దాం. చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్లను సాధించుకుదాం. * బహుజన రాజ్యం తెచ్చుకుందాం. * మండల్ కమీషన్ సిఫారసులన్నీ అమలు చేయాలి. * జనాభా దామాషా రీతిలో అధికారాన్ని పంచుకుందాం. ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు ప్రజా నేస్తం కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు పిలుపు మానవ పరిణామ వికాస క్రమంలో మలుపులు ఎన్నో మైలు రాళ్లు మరెన్నో. అనుభవాలు ఎన్నో. అధ్యాయాలు ఎన్నెన్నో. అనుభవాల సారం, ఆలోచనల ఫలితం వెరసి ఈ జ్ఞాన సముదాయం. బుద్ధిజీవులు ఆదినుంచీ అధిపత్యాన్ని అసలే సహించలేదు. ప్రశ్నిస్తూనే ఉన్నరు. ప్రతిఘటిస్తూనే ఉన్నరు. ఎదిరించకపోతే, బెదిరించే రాళ్లదే రాజ్యం అని గ్రహించిండ్లు. అడుగడుగునా నిలదీసిండ్లు. నిరసించిండ్లు. తమ ప్రాణాలను తృణ ప్రణాయంగా ంచిండ్లు. ఎదిరించిండ్లు. చావుకు సాహసం నేర్పిండ్లు. ఆ త్యాగాల సాలు ఈనాటికీ కొనసాగుతాంది. అనాదిగా ఆధిపత్యంతో పాటే తిరుగుబాటు మొదలయింది. అన్యాయం ఏ రూపంలో ఉన్నా ప్రశ్నించుడు పరిపాటైంది. ప్రజల క్షాన నిలబడి ప్రభువులను నీలదీసిన మహనీయులు ఎందరో. ప్రాణ త్యాగానికి వెనకాడకుండా నిగ్గదీసిన ధీరులు ందరో. ఎప్పటికప్పుడు దుర్నీతిని నిలదీసిండ్లు. దుర్మార్గాలను ఎండగట్టిండ్లు. సమసమాజ స్థాపనకు కృషి చేసిండ్లు. మానవీయ విలువల పరిరక్షణ కోసం మార్గదర్శులు అయిండ్లు. మన భారత దేశంలో లోకాయుతులు, చార్వాకులు, బుద్ధుడు మొదలు బుద్ధిజీవులు ఎందరో ప్రత్యామ్నాయం కోసం పాటు పడుతూనే ఉన్నరు. ఆధునిక సామాజిక ప్లవ పితామహుడు మహాత్మ జోతిరావు ఫూలే, సావిత్రి బాయి ఫూలే, షేక్ ఫాతిమా, ఛత్రపతి శివాజీ, ఛత్రపతి కామ్రేడ్ మున్నా లింగన్న యాదవ్, బోర కొమురయ్య యాదవ్, బోరా ఝాన్సీ లక్ష్మీబాయి యాదవ్, రాహు మహారాజు, నారాయణ గురు, పెరియార్ రామస్వామి నాయకర్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను అక్షరాల కానీరాం ఆచరించి నిరూపించిండు. తెలంగాణల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, పండుగ సాయన్న ముదిరాజ్, దొడ్డి కొమురయ్య యాదవ్, జాటోత్ థాను నాయక్, బండి యాదగిరి, సుద్దాల హనుమంతు, కొమురం భీమ్, చాకలి ఐలమ్మ, సంగం లక్ష్మి బాయి, కొండా లక్ష్మణ్ బాపూజీ, సదాలక్ష్మి, బెల్లి లలిత యాదవ్, మారోజు వీరన్న, శ్రీకాంతచారి, ప్రొఫెసర్ జయ శంకర్, ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ , ఏర్పుల ఐలయ్య యాదవ్ వరకు ప్రజల పక్షాన నిలబడ్డ మహనీయులకు వందనాలు. వీరోచితంగా ప్రభువులతో కొట్లాడిన ఆ మహనీయులను తలుచుకుందాం. తెలుసుకుందాం. వాళ్ళ స్ఫూర్తి పొందుదాం. తెలంగాణల సామాజిక న్యాయ సాధన, ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా నిశ్శబ్ద ఓట్ల విప్లవంతో బహుజన రాజ్యాన్ని స్థాపించుకుందాం. బహుజనులు లేని ఊరు లేదు. ఉత్పత్తి లేదు. సేవలూ లేవు. మన చెమట ఇనుకని చేను లేదు. మనం తయారు చేయని వస్తువు లేదు. బహుజనులు లేని ఉద్యమాలు లేవు. ప్రతి సామాజిక ఉద్యమంల త్యాగాలు మనయి. కానీ ఫలితాలు అందిపుచ్చుకొని భోగాలు అనుభవించేది మరొకల్లు. అన్ని పనులు చేసే మనం అధికారంల ఎందుకు లేం? బహుజనులు నాయకత్వంల నడిచే పార్టీ లేవి? ఎన్నికలల్ల టిక్కెట్లు ఇచ్చే అధికారం ఎవల చేతిల ఉంది? ప్రజాస్వామ్య పద్ధతిల పదవుల పంపిణీ జరుగుతలే. 77 ఏండ్ల స్వతంత్ర పాలనల మన బతుకులు ఆగమైపోయినయి. అధికారం ఎండమావి అయిపోయిందనీ ... కార్మిక వర్గ బోరపుత్రుడు.... కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు పేర్కొన్నారు. మన ఓట్లు వేరే వాళ్లకు వేసి అధికారాన్ని అప్పజెప్పుతున్నాం. వాళ్ళ విదిలించే ఎంగిలి మెతుకుల కోసం ఎగబడుతున్నం. ఇంకెన్నాళ్లు ఈ ఎదురు చూపులు? ఇకనైనా మేలుకుందాం. మనల మనమే ఏలుకుందాం. ఇకపై ఓట్లు మనయే. సీట్లు మనయే అని నినదిద్దాం. నిరూపిద్దాం. జనాభా దామషా రీతిల అధికారంతోపాటు అన్నీ దక్కాలి. ఎదగని వాళ్ళని ఎదగనిద్దాం. అప్పుడే మన బతుకులు బాగుపడుతయనీ... బహుజన రాజ్యాధికార స్వప్నికుడు... బానిసల బంధువు... కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ గా సంక్షిప్తంగా పిలవబడే జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు రిషిబోరా దేవాన్ష్ జె కె ఆర్ గారి జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్ సార్ 8328277285 పేర్కొన్నారు. భావి తరాలకు బంగారు భవిష్యత్తు అందిద్దాం. మన మహనీయుల బాటల నడుద్దాం. ఆ మహనీయుల స్ఫూర్తితో ఉద్యమిద్దాం. మన హక్కులు సాధించుకుందాం. అవకాశాలను అందిపుచ్చుకుందాం. అధికారాన్ని కైవసం చేసుకుందాం. ఇకపై ఓట్లు మనయే సీట్లు మనయే అని నినదిద్దాం. మన ఓట్లు మనమే వేసుకొని నిరూపిద్దాం. రాజ్యాధికారం కోసం సంఘటిత శక్తిగా ముందుకు సాగుదాం. కర్తవ్యోనుముఖులవుదాం. కదం కదం కలుపుదాం. కదనాన దుంకుదాం. మహనీయుల కలలు నిజం చేసుకుందాం. కడపటి విజయం మనదేనని నిరూపిద్దాం. త్యాగాలు మనయే. ఇకపై భోగాలు మనయే. సమన్యాయమే సామాజిక న్యాయం. మహనీయులను స్మరించుకుంటూ మాట్లాడుకుందాం. పాటలు పాడుకుందాం. ఆటలు ఆడుకుందాం. అందరం సమానంగా ఎదుగుదాం. సహజంగా జీవిద్దాం. బానిస భావజాలం వదిలేద్దాం. మనసు నిండా మహనీయుల స్ఫూర్తి నింపుకుందాం. బహుజన సాంస్కృతికోద్యమంల భాగస్వాములమవుదాం. బహుజనులారా! రాండ్లి. మన బతుకులు మార్చుకుందాం. సకల సమస్యలకు రాజ్యాధికారమే పరిష్కారం. సమన్యాయమే సామాజిక న్యాయం. దామాషా రీతిల అధికారాన్ని పంచుకుందాం. రాండ్లి. తండోపతండాలుగా తరలి రాండ్లి. ఊరు ఊరా ఉప్పెనై రాండ్లి. పల్లె పల్లె ప్రభంజనమై రాండ్లి. బహుజన రాజ్యం కోసం బహుగా తరలి రాండ్లి. మహనీయుల కలలు కన్న మానవీయ రాజ్యం తెచ్చుకుందాం. ప్రజాస్వామ్యానికి అసలు అర్ధం చెప్పుదాం. భావి తరాలకు బంగారు భవిష్యత్తునిద్దాం. భారతదేశంల తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ వేకువ వెలుగు అని చాటుదాం. బహుజన భావజాల వ్యాప్తి కోసం ప్రతి జిల్లాల, నియోజకవర్గంల, మండలంల, ఊరురా, పల్లపల్లెనా మహనీయుల జాతరలు చేసుకుందాం. మన జాతి జనులకు ఓటు విలువను తెలియజేద్దాం. ఓట్లు అమ్ముకోవద్దు. కొనొద్దు. పార్టీలు టిక్కెట్లు అమ్మొద్దు కొనొద్దని ప్రచారం చేద్దాం. నీతిగా, నిజాయితీగా ప్రజాసేవ చేసే బహుజన నాయకులనే ప్రజాపతినిధులు-ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నుకుందాం. మన బతుకులు బాగు చేసుకునే బాటలేసుకుందాం.... పేద కులాల విముక్తి కోసం పోరాటం చేస్తున్న పీడిత ప్రజల విప్లవ పోరాటయోధుడు... భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ కార్యదర్శి... బానిసల బంధువు.... బహుజన నేస్తం అవార్డు గ్రహీత కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు రిషిబోరా దేవాన్ష్ జె కె ఆర్ గారి జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ రెడ్ నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్ సార్ 98485 40078 సమస్త పేద కులాలకు పిలుపునిచ్చారు