ఖమ్మం రూరల్ నేలకొండపల్లి కేంద్రాలలో" హైడ్రా జ్వరం

Aug 26, 2024 - 19:32
 0  248
ఖమ్మం రూరల్ నేలకొండపల్లి కేంద్రాలలో" హైడ్రా జ్వరం

*కబ్జాలకు గురైన దేవాలయ భూములు...?
*నేలకొండపల్లిలో ఆక్రమణలు..? కబ్జాల పర్వం..?
*వివిధ శాఖల నుండి... కేటగిరీల వా రిగా వివరాలు సేకరణ...?
*వణికి పోతున్న గత ప్రభుత్వ హయాంలోని అనుచరులు...?
 *నేటి ప్రభుత్వంలోని "మరికొందరు"?
*వెంచర్లలో బఫర్ జోన్లు సైతం దర్జాగా కబ్జా...?
తెలంగాణ వార్త... ప్రత్యేక "కథనం"...1

పాలేరు ప్రతినిధి/తెలంగాణ వార్త ఆగస్టు 26 సోమవారం:- ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం నేలకొండపల్లి కూసుమంచి ముదిగొండ మండలాలలో గత ప్రభుత్వ హయాంలో నుండి నేటి వరకు కబ్జాలు జరుగుతూనే ఉన్నాయి. దర్జాగా నిర్మాణాలు జరిపి కోట్లాది రూపాయల ప్రభుత్వ స్థలాలను భూములను తమకబంధహస్తాలలో బందీ చేసిన కబ్జారాయుళ్ల గుండెల్లో హైడ్రా భయం వెంటాడుతూ జ్వరాన్ని మించిన టెంపరేచర్ తో వణికి పోతున్నారనే సమాచారం అందుతుంది. ప్రధానంగా ఖమ్మం రూరల్ మండలం లో ఓ మూడు రియల్ ఎస్టేట్ సంస్థలు ఎన్ఎస్పి కాలువ భూములను సైతం కబ్జాలు చేసి దర్జాగా వెంచర్ల నిర్మాణం చేస్తే సంబంధిత అధికారులు గత పదిహేను నుండి నేటి వరకు కూడా అన్నీ తెలిసినప్పటికీ కనీసం ఆ దిశగా చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వెంచర్లలో బపర్ జోనులను సైతం చేసి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేలకొండపల్లి మండలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చెందిన భూములను సుమారు 100 ఎకరాలు మేర కబ్జా రాయులు కబ్జా చేసి దర్జాగా ప్రభుత్వ అనుమతులు పొంది సాగును సైతం చేసుకుంటున్న దౌర్భాగ్యమైన స్థితి నెలకొన్నదనే ఆరోపణలు సైతం ఉన్నాయి. నేలకొండపల్లి మండలంలో రియల్ ఎస్టేట్ సంస్థలు సుమారు 16 చోట్ల వెంచర్లు వేయగా బఫర్ జోన్ల సైతం కాజేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలకు నిత్యం వైద్య సేవలు అందించే ప్రభుత్వ దవాఖాన సైతం కబ్జాల కోరల్లో చిక్కుకొని కాలం వెల్లదీస్తుందనేది బహిరంగ రహస్యం. వీటితో పాటు విద్యుత్ కార్యాలయం డొంక రోడ్లు ఎన్ ఎస్ పి స్థలాలు దేవాలయ భూములు ఓ పార్టీ ఆఫీసు దగ్గర 350 గజాల కబ్జా ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది. నాటి  ప్రభుత్వం నుండి నేటి ప్రభుత్వం వరకు కబ్జాల పారంపర కొనసాగుతూనే ఉన్నదని మండల ప్రజలు నేలకొండపల్లి వాసులు ఆరోపిస్తున్నారు. ముదిగొండ నేలకొండపల్లి మండల ఆర్ అండ్ బి రోడ్లు గ్రీన్ బెల్టులు వీడిఓ స్థలాలు చివరికి పోలీస్ స్టేషన్ గ్రామపంచాయతీ కార్యాలయం కబ్జా కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా హైదరాబాద్ లో గుబులు పుట్టిస్తున్న హైడ్రా అడుగులు ఖమ్మం నియోజకవర్గం పాలేరులో రానున్న కొద్ది రోజుల్లో అడుగులు వేనున్నదని విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది. నేలకొండపల్లి మండల కేంద్రం తో పాటు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు పురాతన నిర్మాణాలు వందల సంవత్సరాల నుండి ఉన్నప్పటికీ దేవాలయాలకు సైతం కబ్జాల బెడదతో సతమతమవుతుందనే ఆరోపణలతో పాటు దేవాదాయ ఆర్ అండ్ బి ఎన్ఎస్పి నీటిపారుదల శాఖల అధికారుల పనితీరు నియోజకవర్గ వ్యాప్తంగా విమర్శలకు దారితీస్తోంది. ఈ ఏడాది న్యూస్ తెలంగాణ పలు సంచలన కథనాలు ప్రచురించినప్పటికీ కొన్ని రోజులు హడావుడి చేసిన అధికార యంత్రాంగం అదిగో సర్వే ఇదిగో సర్వే అంటూ వర్షాకాలం సీజన్ వచ్చేవరకు కాలయాపన చేసినట్లు ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం పలుకుబడి పరపతి కలిగిన అధికార పార్టీ అండదండలు కలిగిన వారి పట్ల ఉదాసీనంగావ్యవహరించిందని ఆరోపణలు బహిరంగ రహస్యమేనని పలువురు ఆరోపిస్తున్నారు. నేలకొండపల్లిలో పెద్ద చెరువు కబ్జా కోరల్లో చిక్కి ప్రతి ఓ ఏడాది వార్తల్లో నిలవడం విశేషం. చెరువుకు మూడు వైపులా దర్జాగా ఆక్రమాలపర్వం కొనసాగుతూనే ఉందని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలంలో కూడా ఎన్ఎస్పి బఫర్ జోన్లు గ్రీన్ బెల్టులు ల భూములు కంటికి కనపడకుండా నామరూపాలు లేకుండా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రా తరహా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసి ఆ మేరకు కేటగిరీ వారీగా ఉదాహరణకు తక్షణం కబ్జాలను తొలగించే అవకాశాలు ఉన్నా విధానం రెండవది కొద్దిగా జాప్యంతో ఇలా మూడు వర్గాలుగా విభజించి సమాచార సేకరణ చేస్తున్నట్లు తెలుస్తుంది. వ్యవసాయ సీజన్ కావటంతో ఎన్ ఎస్ పి స్థలాలకు కబ్జాల నుండి విముక్తి కల్పించాలంటే పంటలు వేసిన పొలాలు కొంచెం ఆటంకం గా మారే అవకాశం ఉన్నదని రైతులు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉండదని అధికారులు తర్జనభర్జన
 పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తుండగా బఫర్ జోన్లు గ్రీన్ బెల్ట్ లు ఆర్ అండ్ బి స్థలాల లాంటివి కబ్జాల విముక్తి తక్షణం చేయవచ్చునే అభిప్రాయం వ్యక్తం అవుతుందని తెలుస్తోంది.

*కబ్జాలకు గురైన చెరువులు కుంటలు ఎన్ఎస్ పి స్థలాలు ఆర్ అండ్ బి రోడ్లు ఇతర కబ్జాల పర్వం పై.. రేపటి కథనంలో మరెన్నో సంచలన నిజాలు...?

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333