వాహనదారులకు హెచ్చరిక.
జోగులాంబ గద్వాల 16 జూన్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఐజా. నుండి కర్నూలు వైపు వెళ్లే పెదవాగు పైన పెద్దపెద్ద రంద్రాలు పడడం ద్వారా వచ్చి పోయే వాహనదారులు ఇబ్బందికి గురవుతున్నారు.? అందులో పడి ప్రమాదానికి గురై అవకాశం ఉంది.? కాబట్టి ఆర్ అండ్ బి అధికారులు అప్రమత్తమై ఇట్టి రంధ్రాలపై చర్య తీసుకోగలరని వాహనదారుల తరపు నుండి విజ్ఞప్తి చేస్తున్నాము.? లేకపోతే వాహనదారులకు ఏవైనా ప్రమాదాలు జరిగి ప్రాణాలకు ముప్పు వాటిల్లితే భారీగా జన సమీకరణ చేసి ధర్నా చేపడతామని వాహనదారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.