అచ్చమ్మ కు చేయూత
జోగులాంబ గద్వాల 16 జూన్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- వడ్డేపల్లి. మున్సిపాలిటీ కేంద్రం ఐన శాంతినగర్ లో ఏలాంటి ఆధారం లేకుండా ఉన్న అచ్చమ్మ కు శాంతినగర్ సేవా సమితి వడ్డేపల్లి వారు ఆదివారు రోజు రూ*4000=00 ఆర్థిక సహాయం అందించి, తనకు అవసరం అయ్యే, కొన్ని మౌళిక వసతులను కల్పించారు. ఈ సందర్బంగా శాంతినగర్ సేవా సమితి వడ్డేపల్లి సభ్యులు మాట్లాడుతు..... అచ్చమ్మ కు గత కొన్ని సంవత్సరాలు గా ఆసరా గా సేవా సమితి ఉన్నదని, తనకు ఆధార్ లేని కారణంగా పెన్షన్ రావడం లేదని, అందుకే తన అవసరాల కొరకు ఈ ఆర్థిక సహాయం అందిస్తున్నామని, ప్రతి నెల అచ్చమ్మ కు ఆర్థిక సహాయం అందించే ప్రయత్నం చేస్తామని శాంతినగర్ సేవా సమితి వడ్డేపల్లి సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమం లో షేక్ అస్లాం షరీఫ్, దాసువరం నాగరాజు, దొండే రమేష్, మాలిక్, ఆటో ఖలీల్, డిష్ గౌస్ పాల్గొన్నారు.