నమ్మకానికి మరో చిరునామా లక్ష్మీ రాజేశ్వరి జ్యువెలర్స్

సూర్యాపేటలో కస్టమర్ల నమ్మకానికి మరో పేరుగా లక్ష్మీ రాజేశ్వరి జ్యువెలర్స్ నిలుస్తుందని దుకాణ యజమానులు గుడిపాటి నాగరాజు బిక్కు మల్ల రాఘవేందర్ లు తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాల బావి సెంటర్ లో నూతనంగా ఏర్పాటుచేసిన లక్ష్మి రాజేశ్వరి జ్యుయెలర్స్ షో రూమ్ లో బంధుమిత్రులతో కలిసి లక్ష్మీ పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా లక్ష్మి రాజేశ్వరి జ్యువెలర్స్ లో మజూరి, తరుగు లేకుండా నాణ్యమైన 91.6 బిఐఎస్ హాల్ మార్క్ బంగారు ఆభరణాలు లభిస్తాయని తెలిపారు. మద్యతరగతి ప్రజలకు నాణ్యతగల బంగారు ఆభరణాలను మార్కెట్ ధరకు అమ్మకాలు చేస్తున్నామని తెలిపారు. మా వద్ద వెండి వస్తువులు, వెండి పూజా సామాన్లు నూతన వెరైటీలలో తయారు చేసినవి అమ్మబడునని తెలిపారు. మిత్రులు శ్రేయోభిలాషులు మా నూతన వ్యాపారాన్ని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బిక్కుమళ్ల అనిత, బిక్కుమళ్ల పుష్పావతి, బిక్కుమళ్ల అతిధి కృష్ణ, తిరునగరు శ్రీనివాసు, ఉమాదేవి, మచ్చా శంకర్, కవిత, గుడిపాటి శేషయ్య, నాగవల్లి, కృష్ణప్రసాద్, కక్కిరేణి చంద్రమోహన్, మాడుగుల నవీన్, బచ్చు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.