వరి కొయ్యలకు నిప్పంటించడంతో అనేక అనర్ధాలు... బి అనిల్ కుమార్
మునగాల 01 మే 2024 తెలంగాణ వార్త ప్రతినిధి :- వరికొయ్యలకు నిప్పు అంటించడంతో అనేక అనర్థాలు సంభవిస్తాయని మండల వ్యవసాయ అధికారి బి . అనిల్ కుమార్ తెలిపారు.బుదవారం మండలపరిధిలోని కొక్కిరేణి గ్రామంలో రైతులకు అవగాహనా సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరికొయ్యలకు నిప్పుపెట్టడం వలన గ్రామాల్లో హరితహారం మొక్కలు, పండ్ల తోటలు వ్యవసాయ మోటార్లు తగలబడు తున్నాయని, వ్యవసాయ వ్యర్థలకు నిప్పులు పెట్టి భవిష్యత్ తరాలకు భూమిలో సారాన్ని లేకుండా చేస్తున్నారని తెలిపారు. కోత అనంతరం గడ్డిని కొందరు మోపులు కట్టుకుంటుండగా మరికొందరు పొలంలోనే కాల్చి వేస్తున్నారని తెలిపారు. అయితే రైతులు నాటు పెట్టే ముందు వేస్ట్ ఢీ కంపోజర్ను నీటిలో వదిలితే పొలాల్లో ఉన్న గడ్డి 20రోజుల్లో కుళ్లిపోతుందన్నారు. వరి కోసిన అనంతరం ఉన్న కొయ్యకాళ్లకు, గడ్డికి నిప్పు పెట్టడం ద్వారా భూమిలో కార్బన్ శాతం తగ్గుతుందని తెలిపారు. దీంతో మొక్కలకు అందాల్సిన పోషకాలు పోషకాలు లభిస్తాయని, రైతులు కల్లం చేసిన తర్వాత మిగిలిన గడ్డిని తగలబెట్టకూడదన్నారు.రోటోవేటర్తో దున్ని సూపర్ పాస్పేట్ చల్లితే మురిగిపోతుందని లేదా ఢీకంపోజర్ వాడితే సరిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి SK. ముస్తఫా, పంచాయతీ కార్యదర్శి కృష్ణ , రైతులు పాల్గొన్నారు.
అలాగే నెలమర్రీలో ఏర్పాటు చేసిన వరి కొయ్యకాలు తగలబెట్టకుండ రైతులకు అవగాహన కార్యక్రమంలో ఎంపిడిఓ రమేష్ దీన్ దయాళ్,AEO భవాని పాల్గొనటం జరిగింది.