గద్వాల తెలుగు పేట 24వ వార్డు లో పడిపోయిన ఇంటిలో జాతీయపక్షి లభ్యం.

Sep 15, 2024 - 22:44
 0  16
గద్వాల తెలుగు పేట 24వ వార్డు లో పడిపోయిన ఇంటిలో జాతీయపక్షి లభ్యం.

జోగులాంబ గద్వాల 15 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి.


జిల్లా కేంద్రంలోని
ఎక్కడి  నుంచి వచ్చిందో తెలియదు 24 వ వార్డు తెలుగు పేటలో పడిపోయిన ఇంటిలో దాక్కున్న నెమలిని కుక్కలు వెంబడించి పట్టుకొని ఈడ్చుకొని వస్తుంటే వార్డు ప్రజలు గమనించి  కుక్కలను  తరిమివేసి  కొన ఊపిరితో ఉన్న నెమలిని వార్డు  ప్రజలు అన్ని విధాలుగా ప్రయత్నించిన కాపాడలేకపోయారు. ఈ విషయం 24 వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాసులు దృష్టికి  వార్డ్ ప్రజలు తీసుకెళ్లగా ఆయన వెంటనే అక్కడికి చేరుకొని ,గద్వాల పోలీసు వారికి తెలియపరచడం జరిగిందని పోలీసు వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి తెలియపరచినట్లు  కౌన్సిలర్ శ్రీనివాసులు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333