పోలీస్ గ్రీవెన్స్ డేలో బాధితుల పిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పి నరసింహ

Jul 13, 2026 - 22:58
Jul 13, 2026 - 22:59
 0  1
పోలీస్ గ్రీవెన్స్ డేలో బాధితుల పిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పి నరసింహ
పోలీస్ గ్రీవెన్స్ డేలో బాధితుల పిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పి నరసింహ
పోలీస్ గ్రీవెన్స్ డేలో బాధితుల పిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పి నరసింహ
పోలీస్ గ్రీవెన్స్ డేలో బాధితుల పిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పి నరసింహ

సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పి నరసింహ ఐపీఎస్ పిర్యాదుదారుల నుండి వినతులు స్వీకరించారు. జిల్లా పరిధిలోని వివిధ మండలాల నుంచి వచ్చిన బాధితులు వివిధ సమస్యలపై ఫిర్యాదులకు సంబంధించి బాధితులు ఎస్పి గారిని ప్రత్యక్షంగా కలిసి వినతులు సమర్పించారు.

ఈ సందర్భంగా ఎస్పి గారు ప్రతి ఒక్క బాధితుడి సమస్యను విని, వాటి పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకునేలా సంబంధిత పోలీస్ అధికారులుతో ఫోన్ ద్వారా మాట్లాడి అవసరమైన సూచనలు జారీ చేశారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా, వారి సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలనే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అలాగే, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం  పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఎస్పి గారు తెలిపారు. 

చట్టబద్ధమైన విధానంలో ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333