సూర్యాపేట హోటల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

Jul 12, 2026 - 18:48
Jul 12, 2026 - 18:49
 0  1
సూర్యాపేట హోటల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
సూర్యాపేట హోటల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

సూర్యాపేట, 12 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- సూర్యాపేటలో హోటల్ యజమానులు ఐకమత్యంతో   పనిచేస్తూ అసోసియేషన్ ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి అన్నారు.  ఆదివారం స్థానిక స్టార్ బ్యాంకెట్ హాల్  లో సూర్యాపేట హోటల్స్ అసోసియేషన్  నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది.  తాజా మాజీ అద్యక్షులు జానకిరాములు అద్యక్షతన జరిగిన  ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి వేణుగోపాల్,  కోశాధికారి రామమూర్తిలు మాట్లాడుతూ అసోసియేషన్ బలంగా ఉన్నప్పుడే  హోటల్  యజమానుల సమస్యలు పరిష్కారం అవుతాయని, అందుకోసం ప్రతి ఒక్కరు తమ వంతు సహకారం అందించాలని అన్నారు‌. ఈ కార్యక్రమంలో పట్టణ హోటల్స్ అసోసియేషన్  నూతన  అధ్యక్షులుగా పానుగంటి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి చీర్యాల నరేష్,  కోశాధికారి గా వనం మురళీకృష్ణ,  ఉపాధ్యక్షులుగా రమేష్ శెట్టి,  లతీఫ్ , ప్రచార కార్యదర్శులు గా రాము, దయాకర్, గిరి,  శ్రీనివాసులును ఎన్నుకున్నారు. కార్యదర్శి గా సాంబయ్య,  మధు కమిటీ సభ్యులుగా ప్రవీణ్, బాబా, పవన్, సుధా కిషోర్, వెంకటేశ్వర్లు,  సాయి, లక్ష్మణ్, లింగం, రాఘవ శెట్టి, సైదులు, హరిప్రసాద్ నాగరాజు,  సలహాదారులుగా సింగరికొండ రవీందర్, పాండయ్య, ప్రభాకర్ పరమేష్, రాము, సతీష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333