- సిబ్బంది కుటుంబాలకు బాసటగా పోలీసు భద్రత స్కీమ్.
-- కుటుంబాల సంక్షేమానాకి భరోసా.
-- కె. నరసింహ ఐపిఎస్,. జిల్లా యస్.పి.
సూర్యాపేట జిల్లా నాగారం పోలీస్ స్టేషన్ నందు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కమలాకర్ ఆకాలంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందినారు. మరణించిన కానిస్టేబుల్ కమలాకర్ కుటుంబానికి పోలీసు భద్రత స్కీం యొక్క నగదు చెక్కు ను జిల్లా యస్.పి నరసింహ ఐపిఎస్ గారు జిల్లా పోలీస్ కార్యాలయం నందు అతని కుటుంబ సభ్యులకు అందజేసినారు.
పోలీసు శాఖలో పని చేస్తూ ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కుటుంబాలను పోలీసు శాఖ అన్ని విధాలుగా అదుకుంటుందని, దివంగత సిబ్బంది కుటుంబాలకు పోలీసు భద్రత స్కీమ్ బాసటగా నిలుస్తుంది అన్నారు. కమలాకర్ గారి కుటుంభం యొక్క సంక్షేమానికి కృషి చేస్తామని యస్.పి గారు తెలిపినారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ అధికారి మంజు భార్గవి, పోలీసు సంఘం అధ్యక్షులు SI రామచందర్ గౌడ్, సిబ్బంది ఉన్నారు.