జర్నలిస్టుల దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి

Jul 13, 2026 - 23:22
 0  1

 టీ డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి వెంకటేశ్వర్లు

 జోగులాంబ గద్వాల 13 జులై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.


* గద్వాల.
:  జర్నలిస్టుల సమస్యలపై టి డబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు  సోమవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు టి డబ్ల్యూ జేఎఫ్ యూనియన్ జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో  ఇండ్లు, స్థలాలు, హెల్త్ కార్డులు, ఇవ్వాలని నినాదాలు చేశారు. తరువాత  కలెక్టర్ కార్యాలయంలో ఏవో రాంభూపాల్ కి జర్నలిస్టుల డిమాండ్లతో లిఖితపూర్వకంగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లాలో వర్కంగ్ జర్నలిస్టులు భారీ సంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషిచేస్తున్నారు. ఎండనక, వాననక విధుల్లో ఉంటున్నారు. తెలంగాణ     ఉద్యమంలోనూ ప్రాణాలకు తెగించి పోరాడారు. ఉద్యమం సందర్భంగా, ఆ తరువాత కూడా వందలాది మంది చనిపోయారు. పరిస్థితులు మారుతున్నాయి.      టిడబ్ల్యూ జెఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..  ప్రభుత్వాల విధానాలు మారిపోతున్నాయి. కానీ, జర్నలిస్టుల బతుకుల్లో మాత్రం ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదు. ఉన్న రెండు వర్కింగ్ జర్నలిస్టు చట్టాలను యూనియన్ గవర్నమెంట్ కోడ్ల కింద మార్చేసి హక్కులను కాలరాసింది. కార్మిక చట్టాలను తుంగలో తొక్కింది. అటు యూనియన్ ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధి, సంక్షేమ పథకాలను జర్నలిస్టులకు అందడం లేదు. చివరకు వృత్తి నిర్వహణకు కావాల్సిన అక్రిడిటేషన్ కార్డులు సైతం సకాలంలో ఇవ్వడం లేదు. అనేక ఉద్యమాల ఫలితంగా గత రెండు నెలల నుంచి అక్రిడిటేషన్ కార్డులు జారీచేస్తున్నారు. అర్హులైన వారందరికి ఇవ్వాలనేది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ప్రధాన ఉద్దేశం. రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీల్లో ఒక యూనియన్ వారికే అవకాశం ఇవ్వడం మూలంగా అన్యాయం జరుగుతున్నది. వెంటనే లోపాలను సవరించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్కార్డులిచ్చి ఆదుకోవాలని కోరుతున్నాం. ఇకపోతే గత 40 ఏండ్లుగా ఉమ్మడి రాష్ట్రంతోపాటు తెలంగాణలోనూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని త్వరితగతిన అమలుచేయాలి. జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సు పాసులు ఉచితంగా ఇవ్వాలి. అలాగే కొత్తగా మెట్రో పాసులను ఉచితంగా జారీచేయాలి. రాత్రిపూట మహిళా జర్నలిస్టులకు పనిచేసే కార్యాలయం నుంచి ఇంటి వరకు ఉచితంగా రవాణా వసతి కల్పించేలా ఆయా సంస్థలపై ఒత్తిడి తేవాలి. లైంగిక నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలి. ఇకపోతే కరోనాకు ముందు జర్నలిస్టులకు ఉన్న రైల్వే పాసుల సౌకర్యాన్ని యూనియన్ ప్రభుత్వం రద్దుచేసింది. దీన్ని పునరుద్ధరించేలా మోడీ సర్కార్పై ఒత్తిడి తేవాలి. ఈ సమస్యలను వెంటనే స్పందించి సానుకూలంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
సమస్యలు:1. అక్రిడిటేషన్ కార్డులను .2.ఒకే యూనియన్ నుంచి ప్రాతినిథ్యం వహించే వారిని అక్రిడిటేషన్ కమిటీల నుంచి తొలగించాలి.3.ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నరలిస్టుకూ హెల్త్కేర్డులివ్వాలి. కంట్రిబూషన్ను ప్రభుత్వమే జర్నలిస్టుల తరపున చెల్లించాలి. 4. ఇండ్లస్థలాలు వెంటనే ఇవ్వాలి.
5.రాత్రిపూట మహిళా జర్నలిస్టులకు పనిచేసే ప్రదేశం నుంచి ఇంటి వరకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి. 6. ఉచితంగా ఆర్టీసీ, మెట్రో పాసులను అందజేయాలి.
7.రైల్వే పాసుల పునరుద్ధరణ కోసం మోడీ సర్కార్పై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి.
8.చిన్న పత్రికలకు పబ్లికేషన్ ఉమ్మడి జిల్లాలోని మండల కేంద్రాలలో అక్రిడేషన్ కార్డు ఇవ్వాలి.
9.చిన్న పత్రికలకు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలి
10.పెండింగ్ బిల్లులను వెంటనే ఇవ్వాలి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జి వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి దాదే పోగు  వెంకటన్న, అక్రిడేషన్ కమిటీ మెంబర్ కాశపోగు జాన్, జాతీయ కౌన్సిల్ నెంబర్లు రాఘవ గౌడ్, రంగముని,రామన్ గౌడ్,ఉపాధ్యక్షులు కే వీరన్న చారి, ఎం. రాముడు, కే.తిరుమల్, రామ్మోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, శాంతన్న,సుధాకర్, తిమ్మ గురు, విష్ణు,దేవేందర్ రెడ్డి, అనిల్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333