ఆమె భద్రతకు పోలీస్ అక్క కార్యక్రమం.

Jul 13, 2026 - 23:06
Jul 13, 2026 - 23:07
 0  3
ఆమె భద్రతకు పోలీస్ అక్క కార్యక్రమం.
ఆమె భద్రతకు పోలీస్ అక్క కార్యక్రమం.

సూర్యాపేట జిల్లాల్లో పోలీస్ అక్క కార్యక్రమం ప్రారంభించిన సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ.

- మహిళలకు, బాలికలకు భద్రత కల్పించడమే లక్ష్యం.. ...సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ.

తెలంగాణ పోలీసు వినూత్నంగా చేపట్టిన పోలీసు అక్క అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయం నందు ఎస్పి నరసింహ అధ్వర్యంలో  మహిళా పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి పోలీసు అక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమం నందు అన్ని పోలీసు స్టేషన్ ల నుండి పోలీస్ అక్క లు హాజరైనారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పోలీస్  అధ్వర్యంలో డిజిపి మహిళల, బాలికల, విద్యార్ధినుల రక్షణ కోసం పోలీస్ అక్క అనే విశిస్టమైన, వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది. సమాజంలో మహిళలకు, పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు దైర్యం కల్పించడం, పోలీసు స్టేషన్ కు వచ్చే మహిళా పిర్యాదుదారులకు, బాధితులకు భరోసా కల్పించడం, స్నేహపూర్వక వాతావరణంలో వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేయడం ఈ పోలీస్ అక్క కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. మహిళలు, విద్యార్థినులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా లేదా భయపడకుండా తమ సమస్యలను ఒక సొంత అక్కతో పంచుకున్నట్లు పోలీసులతో పంచుకునేలా చేయడం అన్నారు. 

మన సమాజంలో మహిళల, విద్యార్ధినుల రక్షణలో, భద్రతలో ఎన్నో మార్పులు, ఎన్నో చట్టాలు ఆదునికరించబడ్డాయి, కొత్త చట్టాలు వచ్చాయి, షీ టీం, బరోసా సెంటర్, సఖీ సెంటర్, ఇలా అనేక రక్షణ విభాగాలు వచ్చాయి, సతీసహగమనం లాంటి పరిస్థితుల నుండి శాస్త్ర సాంకేతిక అవిష్కరణలు చేయడం, చట్టాలను, ప్రభుత్వ పాలనను నడిపించే స్థాయికి మహిళలు ఏదిగారు అన్నారు. మహిళలకు హక్కులను సాధించడంలో ఎందరో మహానుభావులు కృషి చేసినారు.  ఇలాంటి సమాజంలో ఇప్పుడు మహిళల, విద్యార్ధినుల రక్షణ పోలీసు అక్క బాధ్యత అన్నారు. మహిళల, విద్యార్ధినుల రక్షణలో పోలీసు అక్క పటిష్టంగా పని చేయాలని అన్నారు. పోలీసు స్టేషన్ కు వచ్చే బాధితులకు భద్రత, భరోసా కల్పించడం తో పాటుగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బాలికల విద్యాలయాలను, కాలనీలోని మహిళా సంఘాలను సందర్శించి మహిళల రక్షణ చట్టాల గురించి, షీ టీం, బరోసా పోలీస్, పోక్సో చట్టాల గురించి అవగాహన కల్పించాలి అన్నారు. నెలలో ఒక రోజు బాలికల హాస్టల్స్ నందు నిద్రించి స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించాలి అన్నారు. పోలీస్ యూనిఫాం ధరించి పోలీస్ అక్క ఆదర్శంగా ఉండాలని కోరారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళా కానిస్టేబుల్‌ను "పోలీస్ అక్క"గా నియమించాం అన్నారు.  దీని ద్వారా ఆకతాయిల వేధింపులు, ర్యాగింగ్ మరియు బాల్య వివాహాల వంటి సామాజిక అరిష్టాల నివారణకు ఇది ఎంతో తోడ్పడుతుంది. బాధితుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతూ చట్టపరమైన చర్యలు మరియు కౌన్సెలింగ్ అందిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినులలో ఆత్మస్థైర్యం పెరిగి, తమకు ఏ సమస్య ఎదురైనా తక్షణమే స్పందించే ధైర్యం కల్గుతుంది అన్నారు. సమస్యలు, వేదింపులు ఉంటే డయల్.100, 112 లను సంప్రదించి  పోలీసు సేవలు పొందవచ్చు అన్నారు. 

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, అడ్మినిస్ట్రేషన్ అధికారి మంజు భార్గవి, మహిళా ఎస్ఐ లు మౌనిక, నీలిమ, జాన్సీ రాణి, ఏఎస్ఐ లు సైదాని, అరుణా దేవి, కవిత, మహిళా సూపరింటెండెంట్ సబితా రాణీ, శ్రీదేవి, అన్ని పోలీస్ స్టేషన్ ల పోలీసు అక్కలు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333