ప్రజలకు అందుబాటులో ఉండాలి.. ఫిర్యాదులు, కేసులు పెండింగ్ ఉండొద్దు:

సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ

Jul 13, 2026 - 23:09
Jul 13, 2026 - 23:09
 0  1
ప్రజలకు అందుబాటులో ఉండాలి.. ఫిర్యాదులు, కేసులు పెండింగ్ ఉండొద్దు:
ప్రజలకు అందుబాటులో ఉండాలి.. ఫిర్యాదులు, కేసులు పెండింగ్ ఉండొద్దు:

- సూర్యాపేట డివిజన్ స్థాయి అధికారులతో నెలవారీ సమీక్షా సమావేశం.
- నేరాల అదుపునకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి.
- సిబ్బంది పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని డీఎస్పీ, సీఐలకు ఆదేశం.

సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నరసింహ ఈరోజు సూర్యాపేట డివిజన్ స్థాయి పోలీసు అధికారుల నెలవారి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గత నెలలో నమోదైన కేసుల తీరుతెన్నులు, పోలీసు దర్యాప్తు మరియు కేసుల పురోగతి స్థితిగతులను సమీక్షించారు. ఈ సమావేశంలో ఎస్పీ గారు మాట్లాడుతూ, పోలీసు అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి పని చేయాలని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, కేసులు ఏమాత్రం పెండింగ్‌లో ఉండొద్దు అని అధికారులను  ఆదేశించారు. నేరాల అదుపునకు సాంకేతిక పద్ధతులను ఉపయోగించాలని, క్షేత్రస్థాయిలో సమాచారం ఇచ్చే వనరులను (Sources) మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. సమాజంలో నేరాల నియంత్రణకు ప్రజల్లో విస్తృత చైతన్యం కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. డీఎస్పీలు, సీఐలు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ల పనితీరుపై, సిబ్బంది విధి నిర్వహణపై నిరంతర క్షేత్ర స్థాయి పర్యవేక్షణ ఉంచాలని, సిబ్బందిని ఎప్పటికప్పుడు మోటివేషన్ చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.

ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, డిసిఆర్బీ డీఎస్పీ రవి, డీఎస్పీ ప్రసన్న కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ మగ్దూం అలీ, సీఐ లు వెంకటయ్య, నాగేశ్వరరావు, ఉపేందర్ రావు, జిల్లాలోని ఎస్సైలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333