దైవ చింతనతో మానసిక ప్రశాంతత ఎమ్మెల్యే యేన్నం శ్రీనివాస్ రెడ్డి

అడ్డగూడూరు 28 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని లక్ష్మీదేవికాలువ గ్రామంలో గౌండ్ల కులస్తులకు కులదైవమైన కాంట్ల మహేశ్వరుడు-సురాంబా,వనం ఎల్లమ్మ,వనం మైసమ్మ దేవతల కళ్యాణానికి ముఖ్య అతిథిగా హాజరైన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.దైవచింతనతో మానసిక ప్రశాంతత పెంపొందుతుందని మహబూబ్ నగర్ శాసనసభ్యులు యేన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని లక్ష్మీదేవికాల్వ గ్రామంలో కంఠమహేశ్వర స్వామి పండుగకు ముఖ్య అతిథిగా హాజరైనారు.
అంతకు ముందు కాంగ్రెస్ నాయకులు,గ్రామస్థులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనను పెంపొందించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నారగోని అంజయ్యగౌడ్,మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బొమ్మగాని అంజమ్మ లక్ష్మయ్య,కంబాల వీరయ్య,గౌడ సంఘం నాయకులు అంబయ్య,మోల్కపూరి శ్రీకాంత్ గౌడ్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సందీప్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ నాయకులు కప్పల రాజేష్ గౌడ్, షకీల్,చంటి,నలమాద సతీష్,పర్రేపాటి పాండు,ఎల్లముల వీరేష్,కన్నెబోయిన శంకర్,ప్రవీణ్,సురేష్,నరేష్,ప్రశాంత్,గండేల రవి,అజయ్,తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.