లంపి స్కిన్( ముద్ద చర్మ వ్యాధి)వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం
జోగులాంబ గద్వాల 24 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : ఇటిక్యాల మండలాలలో ఆయా గ్రామాలలో తేదీ24/6/2026 నుండి 8/7/2026 వరకు అన్ని గ్రామాలలో లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం జరుగుతుంది. ఈ వ్యాధి ఫాక్స్ జాతికి చెందిన వైరస్ నుండి వ్యాపిస్తుంది. రాబోవు వర్షాకాలంలో ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుంది. ఆకలి మందగించి, శరీరం అంతా బొడుపులు ఉంటాయి, గంగ డోలు వాపు మరియు ముక్కు శ్రావలు, కంటిస్రావాలు ఉండి గర్భస్రావం జరిగే అవకాశం కూడా ఉంటుంది .వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స లేదు ,కావున వ్యాధి రాకుండా ముందస్తుగానే వ్యాధి నివారణ టీకాలు వేయించుకొని పశుసంపదను కాపాడుకొనగలరు.
ఈరోజు ధర్మవరం, ఇటిక్యాల, సాసనులు గ్రామాలలో మొత్తం 290 గోజాతి పశువులకు టీకాలు వేయించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ భువనేశ్వరి,మాసోమన్న ,కార్తీక్ పశు వైద్య సిబ్బంది ,రాజేంద్ర సింహ ,శ్రీనివాసులు,శ్రీరాములు, దేవన్న తదితరులు పాల్గొన్నారు....