రోడ్డు భద్రత నియమాలు పాటించాలి ఎస్సై వెంకట్ రెడ్డి

Jul 22, 2026 - 20:59
 0  2
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి ఎస్సై వెంకట్ రెడ్డి

తిరుమలగిరి 23 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

పోలీస్ ప్రజా భరోసా’ కార్యక్రమంలో భాగంగా, తిరుమలగిరి మండల పరిధిలోని తొండ గ్రామంలో పోలీసు సిబ్బంది విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు.   ఈ సందర్భంగా ఎస్సై వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణ, సీటు బెల్ట్ ధరించడం యొక్క ప్రాముఖ్యత మరియు ట్రాఫిక్ నిబంధనలపై  గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అందులో భాగంగా గ్రామ ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు కోరారు. సీసీ కెమెరాల నిఘా ద్వారా నేరాలను ఎలా అరికట్టవచ్చో ప్రజలకు వివరించారు.  అలాగే, మహిళలు మరియు బాలల భద్రత కోసం ఏర్పాటు చేసిన "పోలీసు అక్క" ప్రతినిధుల పాత్ర గురించి మరియు ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు, యువత ఎలా అప్రమత్తంగా ఉండాలో సైబర్ సెక్యూరిటీ అంశాలపై ప్రత్యేకంగా వివరించారు.ఈ కార్యక్రమంలో   గ్రామ సర్పంచ్ స్వాతి మరియు పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి