జనగామ జిల్లాలో 17 కొత్త మీ-సేవా కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

Sep 5, 2026 - 22:18
Sep 5, 2026 - 22:23
 0  0
జనగామ జిల్లాలో 17 కొత్త మీ-సేవా కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
జనగామ జిల్లాలో 17 కొత్త మీ-సేవా కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
జనగామ జిల్లాలో 17 కొత్త మీ-సేవా కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

జనగామ 06 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- జనగామ జిల్లాలో కొత్తగా 17 మీ-సేవా కేంద్రాల ఏర్పాటు మరియు నిర్వహణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు.

జిల్లాలోని గుర్తించిన మండలాల్లో మీ-సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. స్థానిక అభ్యర్థిత్వానికి సంబంధిత మండలమే ప్రామాణికంగా పరిగణించబడుతుంది. అభ్యర్థులు తాము స్థానికులైన మండలంలో ప్రతిపాదించిన మీ-సేవా కేంద్రానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మండలాల వారీగా కేంద్రాలు
బచ్చన్నపేట – 4
చిల్పూర్ – 1
దేవరుప్పుల – 1
గణపూర్ (స్టేషన్) – 2
జనగామ – 4
లింగాలఘణపూర్ – 2
పాలకుర్తి – 1
రఘునాథపల్లి – 2

మొత్తం – 17 మీ-సేవా కేంద్రాలు.

అర్హతలు

అభ్యర్థి కనీసం గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ సర్టిఫికేషన్ కోర్సు అర్హత కలిగి ఉండాలి. వయస్సు 21 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. మీ-సేవా కేంద్రం ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉండాలి. సంబంధిత మండలానికి స్థానిక అభ్యర్థిగా ఉండాలి. ఎంపికైన అభ్యర్థి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ సమర్పించాలి. స్థానిక మాండలికాన్ని మాట్లాడటం, చదవడం, రాయడం, అలాగే ప్రాథమిక ఆంగ్ల పరిజ్ఞానం కలిగి ఉండాలి.

ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల ప్రారంభం: 07-09-2026 ఉదయం 10:30 గంటలకు
దరఖాస్తుల చివరి తేదీ: 11-09-2026 సాయంత్రం 5:00 గంటలకు
దరఖాస్తుల పరిశీలన: 15-09-2026
తుది అర్హుల జాబితా: 17-09-2026
రాత పరీక్ష: 20-09-2026 ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు

దరఖాస్తులను నిర్ణీత కాలంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం, జనగామ జిల్లా – NIC (గది నం. G5) వద్ద సమర్పించాలి. ఆలస్యంగా అందిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు.

అర్హత కలిగిన అభ్యర్థులకు 20-09-2026న IDOC మెయిన్ మీటింగ్ హాల్‌లో రాత పరీక్ష నిర్వహించబడుతుంది. ఎంపిక నిర్దేశిత విధానం ప్రకారం, అర్హతలు మరియు ధ్రువపత్రాల పరిశీలనకు లోబడి జరుగుతుంది.

అభ్యర్థులు సరైన, పూర్తి సమాచారాన్ని అందించాలి. తప్పుడు సమాచారం లేదా వాస్తవాల దాచివేతకు దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. ఎంపికకు సంబంధించిన ప్రక్రియ ESD MeeSeva Rules, 2025 మరియు సంబంధిత నిబంధనలకు లోబడి ఉంటుంది.

– జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్
జనగామ జిల్లా

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333