రైతు సదస్సుకు బస్సుల్లో బయలుదేరిన గద్వాల నియోజకవర్గ రైతులు

జోగులాంబ గద్వాల 30 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-కేటీ దొడ్డి మండలం చింతలకుంట గ్రామం నుండి బయలుదేరిన రైతులు గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బస్సుల్లో బయలు దేరిన రైతులు.గద్వాల నియోజకవర్గ వ్యాప్తంగా మహబూబ్ నగర్ జిల్లా బుత్పూర్ దగ్గరలోని
ఆమిస్తాపూర్ శివారులో జరుగుతున్న రైతు సదస్సు చివరి రోజు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్న సందర్భంగా గద్వాల నియోజకవర్గంలోని పల్లే పల్లెకు బస్సులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం..
బస్సుల్లో రైతు సదస్సుకు రైతులను, కార్యకర్తలను తరలించే బాధ్యత స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పల్లే పల్లే నుండి రైతులు బస్సుల్లో బయలు దేరుతున్నట్టు పార్టీ శ్రేణులు అన్నారు గద్వాల నియోజకవర్గం నుండి సుమారు 10 వేల మంది రైతులు రైతు సదస్సుకు హాజరుకానున్నట్టు తెలిపారు..