300 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ తహసీల్దార్ G. ప్రసాద్ నాయక్ సహకారం అభినందనీయం 300 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణి కార్యక్రమం ఈరోజు తెలంగాణ బంజారా ఎంప్లాయిస్ సేవా సంఘ్ (TBESS) ఆధ్వర్యంలో ZPHS నెమ్మికల్ పూర్వ విద్యార్థి, ప్రస్తుత కట్టంగూర్ మండల తహసీల్దార్ G. ప్రసాద్ నాయక్ రూ. 20000/-ఆర్థిక సహకారంతో 300 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశం లో తహసీల్దార్ G. ప్రసాద్ నాయక్,మరియు P. దారాసింగ్ MEO ఆత్మకూర్ -S మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలో చదివే పేద విద్యార్థులు బాగా చదివి ఉన్నత లక్ష్యం తో ప్రయోజకులు కావాలన్నారు. దాతలను స్ఫూర్తి గా తీసుకొని భవిష్యత్తులో ఒకరికి సహాయం చేసే స్థాయికి ఎదగాలని తెలిపారు. ఈరోజు ఆత్మకూర్ -S మండలం లోని ZPHS నెమ్మికల్, ZPHS ఏనుబాముల, UPS AVK తండా, PS నెమ్మికల్, PS దుబ్బ తండ, PS పీపా నాయక్ మరియు PS లాల్ తండ విద్యార్థులకు ఎగ్జామ్స్ పాడ్స్, పెన్నులు ఇవ్వడం జరిగింది. కార్యక్రమం లో TBESS జిల్లా ఉపాధ్యక్షులు తావురియా నాయక్, సూర్యాపేట డివిజన్ అధ్యక్షులు V. వెంకన్న నాయక్, ప్రధానోపాధ్యాయులు G. విమల బాయి,P. రమేష్, విజయ లక్ష్మి, ఉపాధ్యాయులు సైదులు, నాగేందర్, సుకన్య తదితరులు పాల్గొన్నారు.