రిపబ్లిక్ డే వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాలి
చర్ల, జనవరి 23: జనవరి 26న జరగనున్న రిపబ్లిక్ డే వేడుకల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని అన్ని ప్రభుత్వ, ప్రవేట్ కార్యాలయాల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని జాతీయ మాల మహానాడు జిల్లా కన్వీనర్ తోటమల్ల రమణ మూర్తి అధికారులకు,అనధికారులకు విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు గురువారం మండల కేంద్రంలోని చర్ల ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జనవరి 26 ఆదివారం జరగబోవు రిపబ్లిక్ డే వేడుకల్లో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కోరారు. భారత గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగ నిర్మాతను స్మరించుకోవడం భారత పౌరులుగా మన బాధ్యత అని అన్నారు. అలాగే అంబేద్కర్ గురించి నేటి సమాజానికి, ముఖ్యంగా యువతకు, విద్యార్థులకు అవగాహన కల్పించేలా రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే వక్తలు ప్రసంగించాలని కోరారు. అంబేద్కర్ ఐడియాలజీ ద్వారా గానే సామాజిక స్పృహ,ప్రజా చైతన్యం లభిస్తుందని తెలిపారు. ప్రపంచ దేశాలకు ఆదర్శవంతంగా నిలవడానికి, భారత రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ ని మర్చిపోవడం అంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించకపోవడమే అని అన్నారు. అంబేద్కర్ పట్ల ఎవరైనా వివక్ష చూయించి రిపబ్లిక్ డే వేడుకల్లో చిత్రపటాన్ని పెట్టని యెడల జాతీయ మాల మహానాడు నాయకులు,కార్యకర్తలు అంగీకరించరని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు జిల్లా కో- కన్వీనర్ ఎడెల్లి గణపతి, సీనియర్ నాయకులు తడికల లాలయ్య, కొంగూరు రమణారావు, మాల మహానాడు మండల గౌరవ అధ్యక్షులు మోత్కూరి ప్రభాకర్, మాల మహానాడు మండల అధ్యక్షులు తోటమల్ల గోపాలరావు, సోషల్ మీడియా నాయకులు బోళ్ల వినోద్, నాయకులు కొంగూరు సత్యనారాయణ, తోటమల్ల రవికుమార్, తోట మల్ల కృష్ణారావు, పాముల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.