జర్నలిస్టు రమణ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటాం

 మిక్కిలినేని శ్రీనివాస్ రావు 

Jul 9, 2024 - 19:56
 0  5
జర్నలిస్టు రమణ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటాం

సూర్యాపేట: జర్నలిస్టు రమణ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని టి యు డబ్ల్యూ జే ఐ జేయు స్టేట్ కౌన్సిల్ సభ్యుడు, ఆంధ్రజ్యోతి జిల్లా స్టాపర్ మిక్కిలినేని శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం కేటి అన్నారం గ్రామంలో టి యు డబ్ల్యూ జే ఐ జేయు రాష్ట్ర కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చలసాని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు 23000 వేలు ఆర్థిక సాయం రమణ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిజం విలువలకు కట్టుబడి ఉన్న రమణ ఎంతోమందికి ఆదర్శం అన్నారు. పేదరికంలో ఉన్న నీతి నిజాయితీలతో కూడిన జీవితాన్ని గడిపారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్అలివేలు భీమ్ రెడ్డి, టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బంటు కృష్ణ  , ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు బత్తుల మల్లికార్జున్ ,ప్రధాన కార్యదర్శి రెబ్బ విజయ్,  కార్యదర్శి ఏబీఎన్ మల్లేష్, గుడిపూడి రామకృష్ణ, సుంకరబోయిన వెంకన్న యాదవ్, జానపాటి శంకర్ యాదవ్,  ఉయ్యాల నరసయ్య, వేణుమాధవ్, కాటం గౌడ్  తదితరులు ఉన్నారు. రమణ కుటుంబానికి ఆత్మకూర్ ఎస్ జర్నలిస్టు లు

 భూపతి రాములు.1000/- 

చంద్రశేఖర్. 500/-


సుందర్ 500/-

మూల వెంకటగిరి 500/- ఆర్థిక సహాయం చేశారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333