రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు పై పునర్ ఆలోచించాలి

Jun 26, 2024 - 18:47
 0  14
రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు పై పునర్ ఆలోచించాలి

రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్

(సూర్యాపేట, టౌన్ జూన్ 26): రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై పునరాలోచించాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ కోరారు బుధవారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజిస్ట్రేషన్ చార్జీలను గత ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు. తిరిగి నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచితే సామాన్య ప్రజలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కానుందని వివరించారు. మార్కెట్ విలువలు పెరగడం వల్ల సామాన్య ప్రజలకు బిల్డింగ్ పర్మిషన్ తో పాటు ఎల్ ఆర్ ఎస్ కు విపరీతంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. మార్కెట్ రేట్లు పెంచడంతో సామాన్య ప్రజలు కనీసం ఇంటిని నిర్మించుకునే పరిస్థితిలో ఉండలేరని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న చార్జీలని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఎల్ అర్ ఎస్ కోసం ఆన్లైన్లో 10000 రూపాయలు చెల్లించిన వారికి మున్సిపాలిటీ అధికారులు ఆప్షన్ తీసుకోవట్లేదు అని చెబుతున్నారు. అవి కూడా ఎల్ఆర్ఎస్ పెండింగ్ లేకుండా రెగ్యులర్ చేసేటట్టు ప్రభుత్వం అమలు చేయాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కొరకు వెయ్యి రూపాయలు  కట్టినవే  అమలు చేస్తున్నారు పదవేల రూపాయలు కట్టినవి అమలు చేయట్లేదని అన్నారు. 142 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్నవి ఒక పది మాత్రమే సుమారు సొంత భవనాలు ఉన్నవి మిగతా అన్ని అద్దె భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి వాటన్నిటిని కూడా పరిశీలించి కొత్త భవనాలు స్థలాలు కేటాయించి నిధులు మంజూరు చేసి సబ్ రిజిస్టర్ కార్యాలయలు ఏర్పాటు చేసి సిబ్బంది కొరత లేకుండా ప్రభుత్వం చూడాలి సూర్యాపేటలో కృష్ణ కాలనీలో గత 20 సంవత్సరాల క్రితమే సబ్ రిజిస్టర్ కార్యాలయానికి  ఎనిమిది గుంటల స్థలం భూమి యజమానులు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు రిజిస్ట్రేషన్ చేశారు. కావున దానికి నిధులు కేటాయించాలని సూర్యాపేట జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. కొత్త భవనాలు ఏర్పాటు చేయాలి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ రియల్ ఎస్టేట్ జిల్లా  గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్ పట్టణ గౌరవ సలహాదారుడు మండాది గోపాల్ రెడ్డి పట్టణ ఉపాధ్యక్షుడు అయితే గాని మల్లయ్య గౌడు ఆకుల మారయ్య గౌడ్ పట్టణ కార్యదర్శి గిరీశం పట్టణ ఉపాధ్యక్షుడు బానోతు జానీ నాయక్ పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకన్న పట్టణ ఉపాధ్యక్షుడు ఖమ్మం పాటీ అంజయ్య గౌడ్ పట్టేటీ కిరణ్ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి లింగయ్య కిషోర్ కుమార్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333