గ్రామీణ వైద్యుల నూతన కార్యవర్గం ఎన్నిక
వాజేడు తెలంగాణ వార్త సెప్టెంబర్ 10:- వాజేడు మండల గ్రామీణ వైద్యుల నూతన కమిటీని సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా చిలకమర్రి తిరుపతయ్య, అధ్యక్షులుగా కారుమంచి రత్న శంకర్, ఉపాధ్యక్షులుగా దేవులపల్లి హరిబాబు, కార్యదర్శిగా ఎగ్గడి కిషోర్, కోశాధికారిగా గోరు లీలా కుమార్, ప్రచార కార్యదర్శిగా సద్ధనపు నరసింహ చారిను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు లోబడి ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని, పరిమితికి మించి వైద్యం చేయకుండా జాగ్రత్త పడాలని, అత్యవసర కేసులు వచ్చినట్లయితే ప్రభుత్వ హాస్పిటల్ కి పంపించి వైద్యాధికారులకు సహకరించాలని సూచించారు. గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇచ్చి గుర్తింపు ఇవ్వడానికి రాష్ట్ర కమిటీకి అనుసంధానంగా ఉంటూ గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మద్దూరు మొగిలి, సోమిడి నరసింహారావు, బొల్లె మోహన్ రావు, అల్లి ప్రశాంత్ కుమార్, రాజు, పాషా, మహేష్, రాజేష్, రాజు, అబ్దుల్లా, భాస్కర్, వెంకట్, ఓంకార్, రవి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నార