మత్తులో భవిష్యత్ ను కోల్పోతున్న యువత
మాదక ద్రవ్యాలు అనగా మానవ శరీరానికి హాని కలిగించే కొన్ని పదార్ధాలు. వీటిని ప్రపంచమంతా డ్రగ్స్ అని వ్యవహరిస్తారు. మాదక ద్రవ్యాల వాడకం ఒక ప్రమాదమైన వ్యసనము (ఆడిక్షన్ ). ఈనాటి యువతరాన్ని దారి మళ్ళించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనది. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాల కన్నా తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి . ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5.6 శాతం జనాభా అనగా 185 మిలియన్ల మంది ఇలా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అంచనాలు తెలుపుతున్నాయి.
వీటికి అలవాటు పడిన విద్యార్థులు, యువకులు చదువులు వదిలి సర్వస్వం కోల్పోయినిర్భాగ్యులౌతున్నారు. ఒకసారి దీనికి బానిసలైన తర్వాతవీటినిసంపాదించడానికి ఎంతటి అకృత్యాలు, నేరాలు చేయడానికి వెనుకాడరు.
మాదక ద్రవ్యాల నిరోధానికి భారత ప్రభుత్వం నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సస్ చట్టాన్ని చేసింది. ఈ మత్తు మందులు పండించేవారు, వ్యాపారం చేసేవారు, కలిగివున్నవారు చట్టపరంగా కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
హాలుసినోజెన్‌లు తీసుకున్నప్పుడు మనిషి వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఆలోచించాలా చేస్తాయి. డెలీరియం అనే దశకు దారి తీసిన తర్వాత రాత్రికి, పగటికి తేడా తెలియదు.ఉదాహరణకు చేతిలో ఫోన్ లేకపోయినా ఫోన్ ఉన్నట్లు ఊహించుకోవడం, కిటికీలను ద్వారాలని భావించడం, లేని మనుషులను ఉన్నట్లుగా ఊహించుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
డిస్‌అస్సోసియేటివ్ అనస్థెటిక్స్ లాంటివి తీసుకోవడం వల్ల నొప్పి తెలియకుండా చేస్తాయి.నార్కోటిక్ అనాల్జెసిక్స్ వాడటం వల్ల నొప్పి తగ్గి ఉద్రేకాన్ని కలిగిస్తాయి. ఇవి తీసుకునే వారి భావోద్వేగాలు మారిపోతూఉంటాయి.ఓపియం (నల్ల మందు), కొకైన్, హెరాయిన్, డెమెరాల్, డార్వోన్, మార్ఫిన్, మేథాడోన్, వికోడిన్, ఆక్సీకోన్టిన్ ఈ తరహా మాదక ద్రవ్యాల కిందకు వస్తాయి.మాదకద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల ఆకలి తగ్గిపోతుంది. నిద్ర పట్టదు. అల్సర్లు, క్రామ్ప్స్ వస్తాయి. జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది.
నిద్రలో సమస్యలు, మానసిక ఒత్తిడి, మూడ్ స్వింగ్స్, అందరితో పోట్లాటలు చేస్తారు.చేతులు, కాళ్ళు వణకడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.జుట్టు ఎండిపోతుంది, వయసు మీరిపోయినట్లుకనిపిస్తారు.మాటలో తడబాటు కలుగుతుంది. కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడతాయి.కొంత మంది డ్రగ్స్ కొనుక్కోవడం కోసం దొంగతనాలు చేయడం కూడా మొదలుపెడతారని వైద్యులు చెబుతున్నారు.
డ్రగ్ వినియోగం వల్ల జరిగే నష్టాలను వివరించేందుకు ప్రతి ఏటా జూన్ 26న మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం జరుపుతున్నారు. ప్రస్తుతం గంజాయి వినియోగం కూడా ఎక్కువ అయింది. సిటీల్లో రేవ్ పార్టీల సంస్కృతి పెరుగుతుంది. పిల్లలు తల్లి తండ్రుల వద్ద ఉండకుండా చిన్న తనం నుండి వారికి దూరం ఉండి చదువుకోవడం, ఒత్తిడిని తట్టుకునేందుకు డ్రగ్స్ వినియోగం పెరిగినట్లు వివిధ నివేదికలుచెబుతున్నాయి.ఉమ్మడి కార్యాచరణ ద్వారానే వీటిని నియంత్రణ చేయవచ్చు.
జూన్ 26- అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం