తల్లిపాలే బిడ్డకు రక్షణ

Aug 7, 2026 - 20:38
 0  2
తల్లిపాలే బిడ్డకు రక్షణ

 తిరుమలగిరి 08 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

 తల్లిపాలు ఇవ్వడం వల్ల పసికందుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, తల్లిపాలే వారికి తొలి రక్షణ కవచమని వైద్యాధికారి రవి తెలిపారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని తిరుమలగిరి మండలం మామిడాల అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆరోగ్య సేవా ప్రదాత (ఎం.ఎల్.హెచ్.పి) రవి మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు తప్పనిసరిగా పట్టించాలని సూచించారు. తల్లిపాలు బిడ్డల శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. బాలింతలకు కుటుంబ సభ్యులు తగిన ప్రోత్సాహం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ బొడ్డు సర్పంచ్ సైదులు,కార్యదర్శి మధు, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.అనిత,అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు రమాదేవి,  యాకమ్మ,ఆరోగ్య కార్యకర్త యశోద, వార్డు సభ్యులు, ఆశా కార్యకర్తలు మణెమ్మ, విజయలక్ష్మి,మార్కు, గర్భిణులు, బాలింతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి