ఆశా కార్యకర్త మృతి ....వారి కుటుంబానికి అండగా నిలిచిన వైద్యశాఖ

Aug 26, 2026 - 21:23
 0  3
ఆశా కార్యకర్త మృతి ....వారి కుటుంబానికి అండగా నిలిచిన వైద్యశాఖ

తిరుమలగిరి 27 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మండలం తాటిపాముల, గ్రామం నందపురం, పరిధిలో విధులు నిర్వహిస్తూ ఆశా కార్యకర్త, కన్నెబోయిన యశోద  “దీర్ఘకాలిక మూత్రపిండ వైఫల్యానికి చికిత్స పొందుతూ” మృతి చెందడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ మరియు తోటి సిబ్బంది    వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అనంతరం ఖర్చుల నిమిత్తం రూ. 20,000/- (ఇరవై వేల రూపాయలు) వైద్య మరియు ఆరోగ్య శాఖ, సూర్యాపేట తరపున ఆర్థిక సహాయం అందజేసి, ఆశా కార్యకర్తలకి వైద్య ఆరోగ్యశాఖ ఎప్పటికీ అండగా ఉంటుందని అన్నారు.... ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, డాక్టర్లుు, ఏఎన్ఎంలుు,  ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి