యాదగిరిగుట్ట అభివృద్ధికి కీలక ఆదేశాలు - సీఎం రేవంత్

యాదగిరిగుట్ట అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేసారు. టీటీడీ బోర్డు తరహలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డ్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనులు వివరాలు ఇవ్వాలని, ఆలయ రాజగోపురానికి బంగారం తాపడం పనులు వేగవంతం చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.