మొక్కలతోనే జీవనాధారం:ఎస్సై శ్రీనివాస్ రావు
కేటి దొడ్డి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటిన ఎస్సై .
జోగులాంబ గద్వాల 22 జూలై 2024 తెలంగాణ వార్త ప్రతినిధి.కేటీ దొడ్డి:-మొక్కలతోనే మానవుడికి జీవనాధారమని మండల ఎస్సై శ్రీనివాస్ రావు తెలిపారు.ఆదివారం ఇందిరా వాన మహోత్సవ కార్యక్రమం లో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై శ్రీనివాస్ రావు మరియు తన సిబంది తో కలిసి 100 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మొక్కల నాటడం వలన కలిగే లాభాలను వివరించారు.మొక్కలు నాటడంతో భారీ ఉష్ణోగ్రతలను నియంత్రించవచ్చని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్రగతికి మెట్లు వేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ తిమ్మప్ప, కానిస్టేబుల్ ఎం శ్రీనివాస్, మహేష్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.