అక్రమ తవ్వకాలపై ఉక్కు పాదం మోపిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్ కుమార్
మెగా ఇంజనీరింగ్ కంపెనీకి చెందిన పలు వాహనాల సీజ్
జోగులాంబ గద్వాల 7 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- వడ్డేపల్లి. భారత్ మాల ప్రాజెక్టు పేరుతో అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లు. సహజ వనరులను కాపాడాల్సిన అధికారులే అలంపూర్ స్థానిక ఎమ్మెల్యే విజయుడు మరియు ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామిరెడ్డి ఒత్తిడితో అక్రమ తవ్వకాలకు సహకరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన సంపత్ కుమార్ . వడ్డేపల్లి పాలిటెక్నిక్ కళాశాల ను అనుకొని ఉన్న ప్రభుత్వ భూమి లో అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న మెఘ ఇంజనీరింగ్ కంపెనీ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వో మరియు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించిన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డా.SA సంపత్ కుమార్ . వెంటనే స్పందించిన పోలీసులు మరియు రెవెన్యూ సిబ్బంది అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులు మరియు స్థానిక ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసి సహజ వనరులన్నింటినీ కాపాడాల్సిందిగా అధికారుల్ని కోరారు. రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో అవినీతికి తావు లేదని ప్రభుత్వ ఆస్తుల్ని కాజేయాలని చూసే కాంట్రాక్టర్లను కతం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని అన్నారు.