చిన్నారుల ఎదుగుదలకు పౌష్టికాహారం అందించాలి
తిరుమలగిరి 26 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా తిరుమలగిరి మండలంలోని తొండ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కందుకూరి మంగ లక్ష్మయ్య హాజరై పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత, సమతుల్య ఆహారంపై అవగాహన కల్పించారు. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో కీలకమని, పిల్లలకు రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, పాలు, గుడ్లు తదితర పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను అందించాలని సూచించారు. పిల్లల ఎదుగుదలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వయస్సుకు తగిన ఆహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు.గర్భిణీలు, బాలింతలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాషమాల స్వాతి పంచాయతీ కార్యదర్శి ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు సైదులు అంగన్వాడి టీచర్స్ అశ్విని హేమలత మంజుల పిఈటి వెంకన్న గర్భిణీలు బాలింతలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు...