నాగరత్నమ్మ మృతి బాధాకరం..... బొల్లం మల్లయ్య

ము నగాల 13 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :- మునగాల మండలం గణపవరం గ్రామానికి చెందిన మద్దూరి రామ్ రెడ్డి మద్దూరి సత్యనారాయణ రెడ్డి మాతృమూర్తి అయినా నాగరత్నమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న కోదాడ మాజీ శాసనసభ్యులు, BRS పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్ వారి పార్థివదేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మునగాల మండల పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్, నాగిరెడ్డి మరియు గ్రామశాఖ అధ్యక్షులు రామ్మోహన్ చారి, జితేందర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్ మరియు బండారు ముత్తయ్య తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.