గద్వాల వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు రేపు సెలవు

Sep 7, 2026 - 19:58
 0  16
గద్వాల వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు రేపు సెలవు

 జోగులాంబ గద్వాల 7 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల: వ్యవసాయ మార్కెట్‌ కమిటీ గద్వాలలో పనిచేస్తున్న దడవాయిలు తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సెప్టెంబర్‌ 8న నిర్వహించే రాష్ట్ర సదస్సుకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు సెప్టెంబర్‌ 8న మంగళవారం గద్వాల వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు సెలవు ప్రకటించినట్లు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్షుడు టీ. తిరుపతి తెలిపారు.కావున రైతు సోదరులు సెలవు రోజున తమ పంట ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు తీసుకురావద్దని ఆయన కోరారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333