మున్సిపాలిటీలకు వరం.. అమృత్ - 2 పథకం..15 పురపాలికల్లో మెరుగుపడనున్న తాగునీటి వ్యవస్థ

Apr 3, 2024 - 19:38
 0  71
మున్సిపాలిటీలకు వరం.. అమృత్ - 2 పథకం..15 పురపాలికల్లో మెరుగుపడనున్న తాగునీటి వ్యవస్థ

జోగులాంబ గద్వాల మూడు ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- పురపాలక సంఘాల్లో తాగునీటి వ్యవస్థ మెరుగుపడేందుకు మార్గం సుగమమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదనకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం లభించి అమృత్-2 పథకం ద్వారా ఉమ్మడి జిల్లాకు భారీగా నిధులు విడుదలయ్యాయి.దీంతో నిధులు విడుదలైన మున్సిపాలిటీల్లో ఇక నుంచి తాగునీటి వెతలకు చెక్ పడనుంది. దీంతో పాటు మహబూబ్ నగర్ జిల్లాకేంద్రంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కూడా రూపుదిద్దుకోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 98 మున్సిపాలిటీల్లో తాగునీటి అవసరాలు తీర్చటం,9 మున్సిపాలిటీల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కోసం అమృత్ - 2 పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ,5386 కోట్లు మంజూరు చేశాయి. 

మొత్తం 107 పురపాలికలను మూడు ప్యాకేజీలుగా విభజించి పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఇప్పటికే ముగించారు. రెండేళ్లలో పనులు పూర్తిచేయాలని గుత్తేదారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. మూడో ప్యాకేజీలోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 16 మున్సిపాలిటీలకు గాను రూ,674.3 కోట్లు త్రాగునీటి నిర్వహణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కోసం మంజూరు కావడంతో ఆయా మున్సిపాలిటీల్లో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంజూరు ఇలా... అమృత్ - 2 పథకంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని 03 మున్సిపాలిటీలకు రూ,341.25 కోట్లు, గద్వాల జిల్లాలో 03 మున్సిపాలిటీలకు రూ,89,46 కోట్లు నిధులు మంజూరయ్యాయి. వనపర్తి జిల్లాలోని 05 మున్సిపాలిటీలకు గాను రూ, 128.29 కోట్లు, నారాయణపేట జిల్లాలోని 03 మున్సిపాలిటీలకు రూ,55.57 కోట్లు, నాగర్ కర్నూలు జిల్లాలోని 02 మున్సిపాలిటీలకు రూ,59.73 కోట్లు అమృత్ - 2 కింద మంజూరయ్యాయి. ఈ నిధులతో 15 మున్సిపాలిటీలల్లో రూ,397.5 కోట్లతో తాగునీటి వ్యవస్థను మెరుగుపరిచే పనులు చేపట్టనుండగా, రూ,276.8 కోట్లతో మహబూబ్ నగర్ లో భూగర్బ డ్రైనేజీ నిర్మాణ పనులు జరగనున్నాయి. ఈ విధంగా విడుదలైన నిధులల్లో నారాయణపేట జిల్లాలోని నారాయణపేట మున్సిపాలిటీకి అత్యధికంగా రూ,27.57 కోట్లు మంజూరయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మున్సిపాలిటీకి అత్యధికంగా రూ,47 కోట్లు మంజూరయ్యాయి. వనపర్తి జిల్లాలోని వనపర్తి మున్సిపాలిటీకి అత్యధికంగా రూ,72.36 కోట్లు, గద్వాల జిల్లాలోని గద్వాల పురపాలికకు అత్యధికంగా రూ,63.25 కోట్లు విడుదలయ్యాయి. 

   ఈ నిధి లన్నింటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నిష్పత్తి ప్రకారం విడుదల చేయటమే కాకుండా, 15వ, ఆర్థిక సంఘం నిధులల్లో నుండి కూడా వాటాగా వినియగించుకునేందుకు నిబంధనలు పొందుపరిచారు. మహబూబ్ నగర్ పురపాలికలో నిర్మించే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి కేటాయించిన నిధులల్లో రూ,10 కోట్లు భూ సేకరణకు కేటాయించారు. మిగతా నిధుల్లో కేంద్ర ప్రభుత్వం వాటా రూ,68.05 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ,117.81 కోట్లుగా ఉంది. 15వ, ఆర్థిక సంఘం వాటా రూ,18.30 కోట్లు కాగా, మహబూబ్ నగర్ పురపాలిక సంఘం వాటా రూ,62.64 కోట్లు ఉండేలా టెండర్లు పిలిచారు. టెండర్లు దక్కించుకున్న కంపెనీలే తర్వాత ఐదు సంవత్సరాలు నిర్వహణ బాధ్యత చూసేలా నిబంధనలు పొందుపరిచారు. 

టెండర్లు పూర్తయ్యాయి : పూర్ణచందర్, కమిషనర్, వనపర్తి మున్సిపాలిటీ. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న అమృత్ - 2 పథకం పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి. ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల పనులు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ నిధులతో ఆయా పురపాలికల్లో చాలా వరకు తాగునీటి సమస్యలు తీరనున్నాయి.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333