మల్దకల్ ఎస్సై నందీకర్ ని కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రామచంద్రారెడ్డి, పెద్దొడ్డి రఘుపతి
మల్దకల్ సెప్టెంబర్ 24 (జోగుళాంబ ప్రతినిధి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని స్ధానిక పోలీస్ స్టేషన్ లో మంగళవారం నూతనంగా ఎస్సైగా పదవి బాధ్యతలు స్వీకరించిన సబ్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్(ఎస్సై) నందీకర్ ని సీనియర్ కాంగ్రెస్ నాయకులు తాటికుంట రామచంద్రారెడ్డి,పెద్దొడ్డి రఘుపతి పాల్గొని ఎస్సై నందీకర్ ని శాలువతో సన్మానించి పూలబోకేను అందజేసి పరిచయం చేసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్సై నందీకర్ వీరితో మాట్లాడుతూమండలంలోని శాంతి భద్రతల పట్ల అన్ని విధాలుగా పోలీస్ డిపార్ట్ మెంట్ కు పూర్తి స్థాయిలో సహకరించాలని ఎస్సై నందీకర్ వారికి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో షేక్షావలి,పెద్దోడి గౌడ్ తదితరులు పాల్గొన్నారు