ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, చిన్నంబాయి మండల జడ్పిటిసి వెంకటరమణమ్మ చిన్నారెడ్డి.
04-05-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
చిన్నంబావి మండల పరిసర ప్రాంతాలైన బెక్కెం, గూడెం, అమ్మాయి పల్లి గ్రామాలలో ముమ్మరంగా ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, చిన్నంబావి మండల జడ్పిటిసి వెంకటరమణమ్మ చిన్నారెడ్డి, ఎన్నికల ఇన్చార్జ్ మాజీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చిన్నంబావి మండలం బెక్కెం, అమ్మపల్లి గ్రామాలలో ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి, ఎన్నికల ఇంచార్జ్ మాజీ స్పోర్ట్స్అథారిటీ చైర్మన్ ఆంజనేయ గౌడ్.
గూడెం ,బెక్కం , అమ్మపల్లి గ్రామాలలో ఉపాది హామీ కూలీల దగ్గరికి వెళ్లి మోసపూరిత హామీలతో అధికారం లోకి వచ్చినా కాంగ్రెస్ పార్టీ నాయకులకు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి RS ప్రవీణ్ గారి గెలుపుతో గుణపాఠం చెప్పాలని అన్నారు.
రేవంత్ రెడ్డిని గద్దె దించటానికి గ్రామాలలో రైతులు సిద్ధంగా ఉన్నారు.
రైతులను నమ్మించి మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్‌కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి.
కేసీఆర్ హయాంలో వడ్లను గిట్టుబాటు ధరకు కొన్నాం. 500 బోనస్‌తో 2500కు కొంటామన్న రేవంత్... ఇప్పుడు రైతులు 1800లకే అమ్ముకుంటుంటే ఏం చేస్తున్నడు?
కేసీఆర్ కరోనా సమయంలో సైతం రైతుబంధు ఆపలేదు.
రేవంత్ రైతులకిచ్చిన రైతుబంధు 15వేలు, కౌలురైతులకు 15వేలు, వ్యవసాయ కూలీలకు 12వేలు ఇస్తామని ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. పైగా 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టిండు.
అవ్వాతాతలకు 4 వేల పింఛన్ ఇస్తామని వాళ్లనూ మోసం చేసింది కాంగ్రెస్.
మెడల పేగులు వేసుకుంట.. జేబుల కత్తెర పెట్టుకుంట అని అంటాడు. ముఖ్యమంత్రి అట్ల మాట్లాడుతాడా?
ఐదు గ్యారంటీలు అమలు చేసినమంటూ సిగ్గులేకుండా అబద్దాలు చెప్తుండు.
మహిళలకు రూ. 2500, తులం బంగారం, 4 వేలు, రైతులకు 500 బోనస్ వచ్చిందా?
ఇంకా దారుణమేమిటంటే కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నేను ఇచ్చిన అని చెప్పుకుంటున్నాడు.
ఓట్ల కోసం కాంగ్రెస్ లీడర్లు వస్తే బుద్ధి చెప్పడానికి మహిళలు, చీపుర్లు, చాటలతో రెడీగా ఉన్నారు.
ఆడపిల్లల పెళ్లికి తులం బంగారం ఇస్తామన్నాడు. రెండు నెలల్లో లక్ష లగ్గాలు జరిగాయి. రేవంత్ లక్ష తులాల బంగారం బాకీ పడ్డడు.
మన గుండెలమీద తన్నిన రేవంత్ రెడ్డిని ఎంపీ ఎన్నికల్లో గడ్డపారలై పోటుపొడవాలె.
ప్రశ్నించే గొంతూక RS ప్రవీణ్ కుమార్ గారిని గెలిపివ్వండి, కాంగ్రెస్ మెడలు వంచి హమీలను అమలు చేస్తాం.
అహంకారంతో కళ్లు నెత్తికెక్కిన కాంగ్రెస్ నేతలు నేలకు దిగిరావాలంటే ప్రవీణ్ కుమార్ ను పార్లమెంటుకు పంపాలి.
ఈ కార్యక్రమం లో ప్రజాప్రతినిధులు ,నాయకులు ,గ్రామప్రజలు ,అభిమానులు ,తదితరులు ఉన్నారు.