మాదకద్రవ్యాల పై విద్యార్థులకు అవగాహన సదస్సు:ఎస్సై బిజ్జ శ్రీనివాసులు
విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఎస్ఐ
జోగులాంబ గద్వాల 24 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : కేటీ దొడ్డి:- మండల పరిధిలోని నందిన్నె ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం స్థానిక ఎస్సై బిజ్జ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మదకద్రవ్యాల వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన సదస్సును నిర్వహించారు.ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగ ఎస్సై శ్రీనివాస్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎస్సై బిజ్జ శ్రీనివాసులు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావిభారత పౌరులని విద్యార్థి దశలోనే పిల్లలను మంచి మార్గంలో నడిపించాలని మన చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని అనైతిక కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి యువత డ్రగ్స్ గంజాయి లాంటి మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ అని అన్నారు. మద్యం మత్తులో ఏమి చేస్తున్నామో అర్థం కాని పరిస్థితిలో ఉంటారని ఈ అలవాటున్న వ్యక్తి అనేక రోగాలకు బారిన పడతారని కాబట్టి యువకులు విద్యార్థులు ఇలాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఎల్లప్పుడూ మంచి మార్గంలోనే నడవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.