మాటల ముత్యాలు జీవిత సత్యాలు...! ముత్యాల మాటలు...
మాటల ముత్యాలు జీవిత సత్యాలు...! ముత్యాల మాటలు...
నిజాయితీ జీవితపు బాటలు...!!
ఎవరూ నేర్పని పాఠాలు... మనిషి ఉన్నత వ్యక్తిత్వపు కోటలు...!!
ఆప్యాయత.. అనురాగపు ఊటలు... ప్రతివారు జీవితంలో నింపుకోవాల్సిన లోటులు...
కరెన్సీ కంటే విలువైన అక్షరపు నోటులు!!!
✍️ డాక్టర్ కృష్ణ బంటు,
(గోల్డ్ మెడలిస్ట్, సీనియర్ జర్నలిస్టు, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత, హ్యూమనిస్ట్, కవి, రచయిత, సోషల్ సైంటిస్ట్, సొసైటీ బిల్డర్, సామాజిక, ఆర్థిక,రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు, మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్) సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి)
మనిషి మంచివాడు కావాలంటే మంచిపనులే చేయనవసరం లేదు. ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు.
జీవితం ఆనందంగా గడపాలంటే.. క్షమించలేని వారిని మరిచిపోవాలి, మరచిపోలేని వారిని క్షమించేయాలి.!
చేసే పని ఏదైనా బానిసలా కాకుండా అ పని మనది అనుకుని యజమానిలా బాధ్యత తీసుకుని కస్టపడి పనిచేస్తే ఎప్పటికైనా నీ కష్టం నిన్ను యజమానిని చేస్తుంది.
భయమనేది ఓటమికి చిరునామా..పట్టుదలనేది విజయానికి చిరునామా..అందుకే భయపడిన వాడిని విజయం వరించదు.. పట్టుదల ఉన్నోడిని ఓటమి భయపెట్టదు.
ఆలోచించి తీసుకున్న నిర్ణయం. శ్రమతో పొందిన అవకాశం. ఓటమి నేర్పిన అనుభవం. వ్యక్తిత్వంచే పొందిన గౌరవం. ఎన్నటికీ వృథా కావు.
పుస్తకాన్ని చదివి జ్ఞానం సంపాదించుకో.. కానీ.. మనుషులను చదవడం మాత్రం మర్చిపోకు.. ఇప్పటి లోకంలో.. జ్ఞానం కంటే.., లోకజ్ఞానం.. చాలా ముఖ్యం..
సత్యాన్ని ఇష్టపడితే సరిపోదు, మాట్లాడాలి. గట్టిగా మాట్లాడాలి. తాత్కాలికంగా అది కొందరిని నొప్పించవచ్చు, కానీ ఒకసారి మాట్లాడేశాక మీ మనసుకు ఎంత తెలిగ్గా ఉంటుందో చూడండి.
చేసిన తప్పు ఎంత చిన్నదైనా ఒప్పుకోవాలి. ఇచ్చిన మాట ఎంత పెద్దదైనా నిలబెట్టుకోవాలి.
మనం రాసే అక్షరాలు తప్పయితే వాటిని సరిదిద్దడం సులభమే, కానీ మనం నడిచే మార్గం తప్పయితే తిరిగి సరిదిద్దడం అంత సులభం కాదు..
తండ్రి తన బిడ్డల కోసం కోట్ల ఆస్తి కూడబెట్టడం కంటే, కస్టపడి పనిచేసేతత్వం అలవాటు చేస్తే వాళ్ళు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
ఎవరికీ తలవంచనిది ఆత్మగౌరవం. ఎవరి ముందు చేయి చాచనిది ఆత్మాభిమానం. ఎవరినీ కాదనలేనిది ఆత్మీయత. ఈ మూడు కలిసిన జీవితమే ఆదర్శనీయం.
నలుగురు గుర్తించాలంటే ప్రతిభ ఉండాలి. నలుగురు గుర్తుంచుకోవాలంటే ప్రవర్తన ఉండాలి. జ్ఞానమున్న వారితో వాదించు. ఓడినా జ్ఞానం వస్తుంది. అజ్ఞానితో వాదించకు నీ విజ్ఞత కోల్పోతావు.
పోటీ ప్రపంచంలో అలుపొస్తుందని ఆగిపోతే నువ్వు లక్ష్యాన్ని ఎప్పటికీ సాధించలేవు ముందు అలుపును అధిగమించు ఆటోమెటిక్ గా లక్ష్యం నీ దగ్గరికి చేరుతుంది.
శరీరం సోమరితనానికి అలవాటు పడిపోతే ఆలోచన ఎప్పుడూ వేరొకరి సహాయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.
కష్ట సమయాలలో చుట్టూ వుండే పరిస్థితులను నియంత్రించలేక పోవచ్చు, కానీ వాటికీ స్పందించే తీరు నియంత్రించుకోగలిగితే అనుకూల ఫలితములను పొందవచ్చు.
ఉన్నంతలో బతికేవారు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు, ప్రిస్టేజీ పోయే వారే పక్కదారులు పట్టిపోతారు .
చెట్టుకు, డబ్బుకు మాటలొస్తే... ఆ రెండు చెప్పే మాట ఒక్కటే ఈ రోజు నన్ను కాపాడు రేపు నిన్ను కాపాడుతా.
అందుకే ఓ మిత్రమా... సరైన ఆలోచన.. సకాలంలో ఆచరణ.. సరైన అనుభవంతో వ్యవహరించు... మనిషిని మనిషిగా గౌరవించే సమానత్వ భావన నీ జీవన యానం కావాలి... అంతరాల దొంతరల నిచ్చెన మెట్ల కులమత వ్యవస్థకు చరమగీతం పాడాలి... మనసును గెలువు మనిషిగా జీవించు...!!