మాట తప్పి రైతంగాన్ని మోసం చేయాలని చూస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం"సామాజిక కార్యకర్త కొల్లు వెంకటేశ్వరరావు

Oct 11, 2024 - 17:03
Oct 11, 2024 - 18:06
 0  27
మాట తప్పి రైతంగాన్ని  మోసం చేయాలని చూస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం"సామాజిక కార్యకర్త కొల్లు వెంకటేశ్వరరావు

మాట తప్పి రైతాంగాన్ని మోసం చేయాలని చూస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం..

మోసం చేస్తే ప్రభుత్వానికి పుట్టగతులుండవని గర్జించాలి రైతాంగం..

రైతన్నల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈనెల అక్టోబర్ 16వ తేదీన బుధవారం మధ్యాహ్నం 2 గం.ల నుండి సాయంత్రం 5 గం.ల వరకు అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల ముందు నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన విజయవంతం చేద్దాం"

 లోకానికి అన్నం పెట్టాలని అహరహం శ్రమించడమే తప్ప ఏనాడూ చేయి చాచి అడుక్కోని అన్నదాతను రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి, వాగ్దానం చేసి మరీ నమ్మించి, గంపగుత్తుగా ఓట్లేయించుకొని, తీరా గద్దె నెక్కినాంక అలవిగాని నిబంధనలతో, ఎంక్వయిరీలు వాయిదాలు అంటూ మరోమరు మోసం చేయాలని చూస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రాజకీయ పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ముక్తకంఠంతో, ఐక్యమత్యంతో హెచ్చరించాల్సిన తరుణం ఆసన్నమైంది రైతన్నలారా.!

  లక్షలాది రైతుల సమక్షంలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ ప్రకారం తక్షణమే బేషరతుగా రెండు లక్షల రుణమాఫీ అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఈనెల అక్టోబర్ 16వ తేదీన బుధవారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల ముందు మధ్యాహ్నం 2 గం.ల నుండి సాయంత్రం 5 గం.ల వరకు నల్ల బ్యాడ్జిలు పెట్టుకొని, నల్ల జెండాలు పట్టుకొని నిరసన ప్రదర్శన చేద్దాం. అప్పటికీ రేవంత్ రెడ్డి మారక పోతే వచ్చే పదిహేను రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీస్ ల ముందు ధర్నాలు నిర్వహించటానికి సైతం వెనుకాడమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెడతాం రేవంత్ రెడ్డీ ఖబర్దార్.. 

  అంటూ చేపట్టబోతున్న మన రైతు ఉద్యమాలలో ప్రతి రైతు పాల్గొని విజయవంతం చేయాలని, తద్వారా రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటలకు 500/- రూ.ల బోనస్ పధకాలు అమలయ్యేలా యావత్తు రైతాంతంగం పోరాడాలని మనవి చేస్తూ..

ప్రత్యేక సూచన: మీరు నిరసన తెలుపుతున్నప్పుడు రైతులు అందురు పాల్గొన్న సమయంలో మీ సెల్ ఫోన్ తోనే అందరూ వచ్చేలా రెండు, మూడు ఫోటోలు తీసి సాయంత్రం 5 గం.ల లోగా పాల్గొన్న రైతుల పేర్లు వ్రాసి అన్ని దిన పత్రికల విలేఖరులకు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వవలసిందిగా కోరుతూ..

                మీ.. కొల్లు వెంకటేశ్వరరావు, కోదాడ.

                        సెల్ నెం: 9347515444.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State