**జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో అభివృద్ధి కొరకు వినతి పత్రం అందజేసిన ఆర్టీసీ సిబ్బంది"ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు**

_*జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో అభివృద్ధి కొరకు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజా అవసరంల నిమిత్తం జగ్గయ్యపేట డిపో అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారికి వినతి పత్రం అందించిన ఆర్టీసీ సిబ్బంది.*_
_జగ్గయ్యపేట పట్టణంలో శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారి నివాసంలో ఈరోజు ఆర్టీసీ సిబ్బంది ఎమ్మెల్యే గారికి ఆర్టీసీ డిపో అభివృద్ధికి కృషి చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు.
1963 వ సం||లో ఏర్పాటుచేసిన APSRTC జగ్గయ్యపేట డిపో 60 సం||లు పూర్తి చేసుకొనినది.
ఒకప్పుడు 125 బస్సులు, 700 మంది ఉద్యోగులతో జగ్గయ్యపేట మరియు నందిగామ నియోజకవర్గాలతో పాటు ఖమ్మం
మరియు నల్గొండ జిల్లా పరిధిలోని ప్రయాణీకులకు విస్తృతమైన ప్రయాణ సౌకర్యాలు కల్పించుట జరిగినది. తదుపరి రాష్ట్ర
విభజన అనంతరం జగ్గయ్యపేట డిపోలోని 26 సర్వీసులు రద్దు అయినందున డిపో అభివృద్ధి కుంటుపడి అటు ప్రయాణీకులు
మరియు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందికి గురైనారు. డిపో గ్యారేజి పాతబడిపోయి వర్షము వచ్చినప్పుడు మొత్తం షెడ్లు అన్నీ
కురిసి బస్సులు రిపేరు చేసే PIT నందు నీళ్ళు నిలిచి తోడిపోస్తున్నప్పటికీ నీట ఊట ఏర్పడి మళ్ళీ నీళ్ళు వెంటనే
వస్తున్నవి. అదేవిధముగా డిపోలోని డిపోమేనేజర్ ఆఫీసు, కంప్యూటర్ సెక్షన్, సెక్యూరిటీ సెక్షన్ మరియు ఉద్యోగుల రెస్ట్
రూమ్ సంబందించిన భవనాలు అన్నియూ పాతబడిపోయి పెచ్చులు ఊడి పడిపోవుచున్నవి. జగ్గయ్యపేట డిపోలోని ప్రధాన
ఆదాయము వచ్చే జగ్గయ్యపేట-విజయవాడ రూటునందు జగ్గయ్యపేట డిపో బస్సులు బదులు IBM, VDPM, GVPT-1
మరియు GVPT-2 తదితర డిపో బస్సులు నందిగామ మరియు కోదాడ వరకు తిప్పుచున్నారు. డిపోలో కనీసం
ఉండవలసిన స్పేర్ బస్సులు కూడా లేకుండా డిపోని నడుపుచున్నారు. డిపోలో కనీసం ఒక్క RTC ఎక్స్ ప్రెస్ బస్సు ఒక్కటి
కూడా లేనందున ఉన్న హైర్ బస్సులు రానప్పుడు బస్సులు పెట్టలేని పరిస్థితి మరియు ఎవరైనా శుభకార్యాలకు,
వేడుకలకు అద్దెకు అడిగినప్పుడు కేవలం పల్లెవెలుగు బస్సులు మాత్రమే ఇస్తున్నారు అందువలన ప్రయాణీకుల రద్దీ
ఉన్నప్పుడు అదనపు సర్వీసులు తిప్పలేక మరియు శుభకార్యాలకు, వేడుకలకు బస్సులు ఏర్పాటు చేసినప్పుడు స్పీర్
బస్సులు లేక ఉన్న సర్వీసులు రద్దు చేయుచున్నారు. రాష్ట్ర వ్యాప్తముగా అన్ని డిపోలకి సూపర్ లగ్జరీ బస్సులు కొత్తవి.
వచ్చినప్పటికీ జగ్గయ్యపేట డిపోకి కొత్త బస్సులు తీసుకొనుటలో అధికారులు సరిగా స్పందించలేదు. బస్సుల రిపేరు
నిమిత్తం కావలసిన స్పేర్ పార్టులు తెప్పించుటలో అధికారులు విఫలమైనందున బస్సులు సరైన కండిషన్ లో లేక
ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందికి గురి అవుచున్నారు. పై కారణముల వలన 60 సం||లు పూర్తిచేసుకున్న జగ్గయ్యపేట డిపో
మనుగడ భవిష్యత్తులో ప్రశ్నార్ధకముగా మారనున్నది. అందువలన డిపో అభివృద్ధికొరకు తమరు ప్రత్యేక చొరవ తీసుకొని
ఉన్నతాధికారులతో చర్చించి ప్రజా అవసరముల నిమిత్తం జగ్గయపేట డిపో అభివృద్దికి కృషి చేయగలరని కోరారు.
ఆర్టీసీ వారు ఇచ్చిన వినతి పత్రం పరిశీలించిన అనంతరం వెంటనే ఆర్టీసీ ఆర్ఎం గారితో మాట్లాడి వచ్చేవారం జగ్గయ్యపేట రావాలని క్షేత్రస్థాయిలో జగ్గయ్యపేట డిపో బస్టాండ్ మరియు కొత్త సర్వీసులో గురించి క్షుణ్ణంగా తెలుసుకొని అన్నింటి గురించి ఒక కార్యచరణ రూపొందించి ఆర్టీసీ వారి సమస్యలు కచ్చితంగా పరిష్కరించాలని అన్నారు._