మంత్రి అడ్లూరి ని కలిసిన మాదిగ జర్నలిస్ట్ ఫోరం బృందం.

అక్రిడిటేషన్ కమిటీ, ఎస్సీ కమిషన్ లో భాగస్వామ్యం కై విజ్ఞప్తి
హైదరాబాద్, ఆగస్టు 21 : తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను గురువారం హైదరాబాదులోని సచివాలయంలో తెలంగాణ మాదిగ జర్నలిస్టు పోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ ఆధ్వర్యంలో ఆ సంఘం ప్రతినిధుల బృందం కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3 వేలకు పైగా మాదిగ,అనుబంధ కులాల జర్నలిస్టులు విధులు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. వృత్తి నిర్వహణలో జర్నలిస్టులకు దాడులు, బెదిరింపులు నిత్య కృత్యమవుతున్న నేపథ్యంలో బాధితుల్లో భరోస నింపేందుకు, దాడుల ఘటనలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేందుకు ఎస్సీ కమిషన్ కమిటీ సభ్యులుగా భాగస్వామ్యం కల్పించడంతోపాటు లో మాదిగ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కమిటీలో అవకాశం కల్పించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.