మహిళా వికలాంగుల సాధికారత కోసం ఉద్యమిస్తాం

Mar 5, 2024 - 18:33
 0  10
మహిళా వికలాంగుల సాధికారత కోసం ఉద్యమిస్తాం

భువనగిరి 05 మార్చి 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- మార్చి 16 వ తేదీన వలిగొండ పట్టణ కేంద్రంలో వికలాంగుల జిల్లా సదస్సు మహిళా వికలాంగుల సాధికారత, విద్యా, స్వయం ఉపాధి, ఆరోగ్యం, భద్రత కల్పించాలని మార్చి 16వ తేదీన వలిగొండ పట్టణ కేంద్రంలో మహిళా వికలాంగుల సదస్సు నిర్వహిస్తున్నామని ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షులు సురుపంగ ప్రకాష్ పిలుపునివ్వడం జరిగింది. మంగళవారం రోజు వికలాంగుల హక్కుల మహిళా వికలాంగుల ముఖ్య నాయకుల సమావేశం జిల్లా  కార్యాలయంలో రాష్ట్ర  జరిగింది.ఈ సందర్భంగా స్వరూపంగా ప్రకాష్ మాట్లాడుతూ.. 2024 మార్చి16వ తేదీన వలిగొండ పట్టణ కేంద్రంలో మహిళా వికలాంగుల జిల్లా సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు.సదస్సుకు అన్ని మండలాల మహిళ ప్రతినిధులు హాజరు అవుతున్నారని అన్నారు .ఈ సదస్సులో మహిళా వికలాంగుల స్థితిగతులపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు.మహిళలను సామాజిక, రాజకీయ, ఆర్థిక రంఘాల్లో సమాన భాగస్వామ్యం కలిపించే లక్ష్యంతో 1975 నుండి ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవన్నీ అధికారికంగానిర్వహిస్తుంది.దేశంలో మహిళలు,మహిళా వికలాంగులపై వేధింపులు, అత్యాచారాలు పెరిగి పోతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. మహిళల రక్షణ కోసం రాజ్యాంగంలో ఉన్న అంశాలు అమలుకు నోచుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది మహిళా వికలాంగులు ఉన్నారు ఐక్య రాజ్య సమితి హక్కుల ఒప్పందం పత్రంలోని ఆర్టికల్ 3,6లలో మహిళా వికలాంగుల హక్కులు పొందుపరచిన అమలు కావడం లేదు. మహిళా వికలాంగుల్లో వివాహం కానీ వారి సంఖ్య సకాలంగా మహిళలతో పోల్చితే 4రేట్లు అధికంగా ఉందని ఉన్నతి అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడి అయ్యింది. మహిళా మానసిక వికలాంగులు 70శాతం లైంగిక దూరక్రమణకు గురవుతున్నారు. గృహహింస చట్టంలోని సెక్షన్ 3(బి),(డి)మహిళా వికలాంగులు వినియోగించుకోవడం లేదు. మహిళా వికలాంగుల హక్కులు, రక్షణ కోసం ఎన్ పి ఆర్ డి నిరంతరం పోరాడుతుంది. మహిళా వికలాంగులపై వేధింపులు అరికట్టెందుకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని, మహిళా వికలాంగులను వివాహం చేసుకున్న వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని, పెండ్లి కానీ మహిళా వికలాంగులకు ప్రభుత్వమే హోమ్స్ ఏర్పాటు చేయాలని  డిమాండ్ చేశారు.మహిళా వికలాంగుల సాధికారత  విద్యా, స్వయం ఉపాధి,ఆరోగ్యం సంరక్షణ, రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 


ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి బొల్లేపల్లి స్వామి స్వామి, జిల్లా మహిళా కన్వీనర్ కె.లలిత, జిల్లా నాయకురాలు బర్ల పార్వతి రూబిన్ కవిత తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333