- మహిళా భద్రతలో షీ టీమ్స్ పని చేస్తున్నాయి.

Sep 19, 2024 - 02:27
 0  3
- మహిళా భద్రతలో షీ టీమ్స్ పని చేస్తున్నాయి.

- వేధింపులపై పిర్యాదు చేయాలి.
- జిల్లా షీ టీమ్స్ హెల్ప్ లైన్ నంబర్ 8712686056.
- గత నెల రోజులుగా షీ టీమ్స్ అధ్వర్యంలో 70 కేసులు నమోదు.
- కోదాడ సబ్ డివిజన్ పరిధిలో షీ టీమ్స్ కార్యాలయం ఏర్పాటు చేశాం.

-.. సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.

మహిళా, విద్యార్ధినుల రక్షణలో జిల్లాలో షీ టీమ్స్ పోలీస్ సిబ్బంది పని చేస్తున్నారని, వేదింపులకు గురవుతున్న మహిళలు, విద్యార్ధి నిలు నిర్భయంగా పిర్యాదు చేయాలని, అవసరాన్ని బట్టి పిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచ బడతాయి అని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపినారు. రద్దీ ప్రాంతాలు, కళాశాలలు, బస్టాండ్ ప్రాంతాల్లో షీ టీమ్స్ సంచరిస్తూ వేదింపులకు పాల్పడుతున్న ఆకతాయిలను గుర్తించి స్పాట్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, కేసు నమోదు చేయడం జరుగుతున్నది. వేదింపులకు పాల్పడుతున్న వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కుటుంబ తగదాల్లో బార్య భర్తలకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు, మహిళల, విద్యార్ధినుల పట్ల ఆకతాయి పనులకు పాల్పడుతున్న యువతను గుర్తించి వారి తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు అన్నారు. కోదాడ సబ్ డివిజన్ పరిధిలో గత నెలలో షీ టీమ్స్ కార్యాలయం ప్రారంభించి మహిళ, విద్యార్ధినుల రక్షణలో పటిష్టంగా పని చేస్తున్నారు కోదాడ డివిజన్ పరిధిలో హాట్ స్పాట్ ప్రదేశాలు గుర్తించి రక్షణ చర్యలు చేపట్టారు, డివిజన్ పరిధిలో గత 15 రోజులుగా 23 కౌన్సిలింగ్ లు, 15 అవగాహన కార్యక్రమాలు, 25 కేసులు నమోదు చేయడం జరిగినది అన్నారు. జిల్లా వ్యాప్తంగా గత నెల రోజులుగా జిల్లాలో షీ టీమ్స్ అధ్వర్యంలో
42 మందికి కౌన్సిలింగ్ లు, 28 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు, 13 పిర్యాదులు స్వికరించారు, ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునీ 45 కేసులు నమోదు చేయడం జరిగినది అన్నారు. వేధింపులపై హెల్ప్ లైన్ నంబర్ 8712686056 ద్వారా పిర్యాదు చేయవచ్చు అన్నారు. 

ఎవరైనా మహిళలను, విద్యార్ధి నిలను వేదిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్పి గారు హెచ్చరించారు. యువత క్రమశిక్షణతో ఉండాలి, ఎదుటి వారిని గౌరవించాలి, విద్యార్థులను ఇబ్బందులు పెట్టవద్దు అన్నారు. కష్టపడి చదువుకునీ భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు రావాలని కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333