మధిర మల్లు భట్టి విక్రమార్క గారి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం
ఘనంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర టిడిపి కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రామనాథం

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మ :- హర్షం ప్రకటించి రాష్ట్ర ఉపముఖ్య మంత్రి వర్యులు శ్రీ భట్టిగారికి కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర టీడీపీ నాయకులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం
మధిర మల్లు భట్టి విక్రమార్క గారి క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలో జాతీయ జెండా ఆవిష్కరించిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ మాజీ ఉపాధ్యక్షులు, ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రామనాధం
తెలంగాణ రాష్ట్ర అవతరణ మహోత్సవంసందర్భంలో మధిర భట్టిగారి క్యాంప్ కార్యాలయంలోఅధికార, అనధికారుల, రాజకీయ నాయకుల సమక్షంలో జాతీయ జెండా ఆవిష్కరించు అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ మల్లు భట్టివిక్రమార్కగారికి రామనాధంహృదయపూర్వక కృతఙ్ఞతలు తెలియజేసారు
మధిర ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజల క్యాంప్ కార్యాలయంగా ఉన్నందున నే నాకు రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంలో ఈ ఉన్నతమైన జాతీయ జెండా ఆవిష్కరణ అవకాశం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టివిక్రమార్క గారు ఇచ్చారని రామనాధం తన ప్రకటనలో తెలియజేసారు