తెలంగాణ ఉద్యమ కారుల కు న్యాయం చేయాలని బత్తుల సోమయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భ ట్టి కి వినతి

Jun 2, 2025 - 17:42
Jun 3, 2025 - 21:17
 0  21
తెలంగాణ ఉద్యమ కారుల కు న్యాయం చేయాలని బత్తుల సోమయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భ ట్టి కి వినతి

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం :- మేము ఉద్యమకారులం.. కేసీఆర్ బాధితులం.. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి.. కేసీఆర్ పతనానికి మేమే కారణం..మీ బాధితులం కావాలనుకోవడం లేదు..అమరవీరుల స్థూపం వద్ద ఉద్యమకారులకు ఘన నివాళి..తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలని బత్తుల సోమయ్య ఆధ్వర్యంలో ఉపముఖ్యమంత్రి భట్టికి వినతి ఖమ్మం, జూన్02: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్య ఆధ్వర్యంలో ఖమ్మంలోని అమరవీరుల స్థూపం దగ్గర ఘన నివాళులర్పించారు. అనంతరం సోమయ్య మాట్లాడుతూ... వేల మంది విద్యార్థుల ప్రాణ త్యాగమే నేటి తెలంగాణ రాష్ట్రం, కానీగత 12 ఏళ్లుగా ఉద్యమ కారుల కుటుంబాలకు చేసింది ఏమి లేదు.., కేవల పది కేజీల పూలు జల్లి నివాళులర్పించి, చేతులు దులుపుకుంటున్నారు. ఒక్కప్పుడు నిధులు, నీళ్లు, నియామకాల కోసం.., మాత్రమే కాదు.. పరాయి పాలన నుంచి విముక్తి కోసం పోరాటం చేశామని అన్నారు. కానీ నేడు స్వ రాష్ట్రంలో సొంత పాలకులపై హక్కులు సాధించుకునేందుకు అడుక్కునే పరిస్థితి దాపురించిందనీ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను పోగొట్టుకున్న తల్లుల ఘోష గత ప్రభుత్వానికి వినిపించలేదు.., వాళ్ళ ఉషూరు తగిలి ఆ ప్రభుత్వం నామరూపాలు లేకుండా పోయిందని అన్నారు. తెలంగాణ ఇచ్చారని.., ఉద్యమకారుల ఆవేదన అర్థం చేసుకుంటారని.., ప్రతి ఊరు తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నామని అన్నారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో మీనమేషాలు లెక్కపెడుతున్నారు. తెలంగాణలో దోచుక్కున డబ్బు విదేశాల్లో ఎక్కడ దాచుకుంటున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, గత పాలకులు అలా చేస్తే.., ప్రస్తుత పాలకులు అందాల పోటీల పేరుతో వేల కోట్ల రూపాయలు ఎవరి పాలు చేస్తున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. గత పదేళ్లు వెలమ దొరలు పాలించి దోచుకున్నారు.., నేడు రెడ్డి దొరలు అదే బాటలో ప్రయాణం చేస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లాకు త్రి మూర్తుల్లాంటి ముగ్గురు మంత్రులు ఉన్నారని ఆశపడ్డాం..,, కానీ మా ఆశలు అడియాశలు చేస్తున్నారని సోమయ్య అన్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా.., ఎన్నడూ కూడా ఉద్యమ కారుల గురించి ఆలోచన చేసిన పాపాన పోలేదని, వాళ్ళ కుటుంబాలను పలకరించిన పాపాన పోలేదని ఆరోపించారు. గొప్పలు చెప్పుకోవడానికి పరిమితమవుతున్నారేతప్పా.., మా ఆవేదన అర్థం చేసుకోవడం లేదని బత్తుల సోమయ్యా అగ్రంహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ మాట్లాడినా 6 గ్యారెంటీల గురించే తప్పా.. ఉద్యమకారుల గురించి వాళ్ళ నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదని అన్నారు. ఎంత సిగ్గు చేటు.. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై ఇప్పటికైనా ఒక ప్రకటన చేయక పోతే మరో ఉద్యమానికి ఖమ్మం నుంచే నాంది పలుకుతామని హెచ్చరించారు. ఉద్యమాలు మాకు కొత్త కాదని, అమరవీరుల సాక్షిగా శభధం చేశారు. 

ఉపముఖ్యమంత్రి వినతి...

అనంతరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ను సోమయ్య ఆధ్వర్యంలో కలిశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వినతి పత్రం అందజేశారు. దీనికి భట్టి సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సోమయ్య తెలంగాణ ఉద్యమంపై రాసిన పుస్తకాన్ని ఉప ముఖ్యమంత్రి కి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షుడు అంబాల రామారావు, ప్రధాన కార్యదర్శి అంగిడి బిక్షం, సీనియర్ ఉద్యమకారుడు కోయ వెంకటనారాయణ, మలి దశ ఉద్యమకారులు తునికి పాటి లక్ష్మణ చారి, ఎస్ కే ఫక్రుద్దీన్, ఎస్.కె అఫ్జల్, అశోక్ సింగ్, కుర్రి ముత్తయ్య, ఉల్లోజు వెంకన్న, వడితీయా రాజేష్ నాయక్, ఉల్లంగి పద్మ, లక్ష్మీకాంతమ్మ, జాగాటి నాగేశ్వరరావు, రామాంజనేయులు, గజ్జల ఎల్లయ్య, ఎల్. రామస్వామి, కాలింగ్ గురువయ్య, ఏపూరి సత్యనారాయణ, పెద్దపాక విజయ్ కుమార్, గుగులోతు మంగి లాల్, ఆంగోతు రామ్మూర్తి, కూరపాటి కృష్ణమూర్తి, వడ్డే బోయిన వెంకటేశ్వర్లు, బొల్లికొండ పాపయ్య, తుడుం వీరబాబు, బండీ వెంకట్, మందడి వెంకటేశ్వర్లు, పెద్దపాక విజయ్ తదితరులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State