మండల అధ్యక్ష పదవి సీనియర్లకు ఇవ్వాలి

తిరుమలగిరి 24 జూన్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
త్వరలో జరగనున్న కాంగ్రెస్ పార్టీ మండల గ్రామ నియోజకవర్గ స్థాయి కమిటీల్లో గత 20 సంవత్సరాలు గా కాంగ్రెస్ పార్టీ ని నమ్ముకొని రూరల్ గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న సీనియర్లకు అవకాశం కల్పించాలని తిరుమలగిరి మండల కాంగ్రెస్ నాయకులు గజ్జి లింగన్న యాదవ్ కోరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత పది సంవత్సరాల బి ఆర్ ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తూ ఎన్నో తప్పుడు కేసులు ఇబ్బందులకు గురిచేసిన ధైర్యం చెడిపోకుండా కాంగ్రెస్ పార్టీ కోసం మూడు రంగుల జెండా పట్టుకుని ముందుకు నడుస్తున్న రూరల్ పరిధిలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులకే తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆయన కోరారు. గ్రామాలలో ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ గత పాలకుల చేతుల్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొని కష్టనష్టాలకు ఎదురీది పనిచేసిన వారికే పదవులు కట్టబెట్టాలని అన్నారు. శాసనసభ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుండి శాసనసభ్యులు మందుల సామేలు గెలుపు కోసం సీనియర్ కాంగ్రెస్ నాయకులు అహర్నిశలు కష్టపడి 52,వేల పైచిలుకు మెజార్టీ రాక కోసం ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారికి అందేలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎంతో కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి పట్టణ స్థాయి నాయకులకు కాకుండా గ్రామీణ ప్రాంత స్థాయి నాయకులకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎన్నికల ముందే పార్టీలో చేరి పదవుల కోసం పాకులాడే వారికి పదవులను కట్టబెడితే సీనియర్లు ఊరుకునే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్లను గుర్తించి వారికి సమచిత స్థానం కల్పించాలని కోరారు.