కోరుట్ల బార్ అసోసియేషన్ సభ్యులను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి సర్ధార్ రవీందర్ సింగ్

Feb 20, 2025 - 19:21
 0  28

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జగిత్యాల జిల్లా కోరుట్ల కోర్టులోని బార్ అసోసియేషన్ న్యాయవాదులను కరీంనగర్ మాజీ మేయర్ , రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ , కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి సర్ధార్ రవీందర్ సింగ్ కలిశారు.

ఈ సందర్భంగా రవీందర్ సింగ్ మాట్లాడుతూ ... కరీంనగర్ మాజీ మేయర్ గా , రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందజేశానన్నారు. ఒక్క రూపాయికే అంతిమయాత్ర , నల్ల కనెక్షన్ , సరస్వతి ప్రసాదం వంటి పథకాలు అమలు చేసినట్లు తెలిపారు.

 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించిన వెంటనే పట్టభద్రుల సంక్షేమం కోసం కేవలం ఒక్క రూపాయికే 5 లక్షల ఇన్సూరెన్స్ స్వయంగా భీమా అందజేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత (1) ఓటును తనకు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు తన్నీరు శ్రీనివాస్ రావు, సెక్రటరీ సుతారి శ్రీనివాస్ , కోశాధికారి చిలువేరి రాజశేఖర్ , న్యాయవాదులు కటుకం శ్రీధర్ , కడకుంట్ల సదాశివరాజు , కొంపెల్లి సురేష్ , నవీన్ , అల్లె రాము , ప్రేమ్ సాగర్ , సంగ విజయ్ సాయి , గోసికొండ సురేష్,వురడి నరేందర్ , ఓర్సు రాములు , ఉమ , దీపా తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333