భూమి ఉంటే భుక్తి దొరుకుతుంది..

Jan 6, 2025 - 09:54
Feb 13, 2025 - 19:20
 0  22
భూమి ఉంటే భుక్తి దొరుకుతుంది..

( మన )భూమి 

రచన:- కడెం ధనంజయ

గ్రామం: చిత్తలూరు 

భూమి ఉంటే భుక్తి దొరుకుతుంది.. 

భక్తి కలుగుతుంది 

భాధతీరుతుంది.. భూమి కన్నతల్లి లాంటిది.. 

ఆదుకుంటుంది, అవసరాన్ని తీర్చుతుంది, అన్ని తానై నడిపిస్తుంది..నమ్ముకోవాలి, కాపాడుకోవాలి,పంటనిస్తుంది..పాడికి మేతనందిస్తుంది.. పక్షులకు,సమస్త జీవులకు 

ఆశరాగ ఉంటుంది.. నీటిని నిల్వచేస్తుంది..చెట్టుకు పుట్టకు జన్మనిస్తుంది రక రకాల నేలను,మట్టిని రంగు రంగుల రాళ్ళనిస్తుంది.భూమి ఉంటే అప్పు పుడుతుంది 

ఉపాధినిస్తుంది, ఉన్న ఊరిలో, సంఘములో గౌరవం ఉంటుంది. 

ఉన్నతమైన బ్రతుకునిస్తుంది. 

భూమంటే అమ్మనే 

దైర్యమొస్తుంది, అప్పుడపుడు అలిగిన,ప్రకృతి సహకరించకున్న 

సహాయపడుతుంది. 

ఎంతో కొంత భూమి ఉండాలి? 

రెక్కల కష్టాన్ని నమ్ముకోవాలి? 

ఇంటీల్లిపాది శ్రమ చేయాలి? 

ఫలితాన్ని అనుభవించాలి.. 

భూమి ఆపదకు, అవసరానికి 

వెనక ఉండి నడిపిస్తుంది.. 

చితికి, చివరి శ్వాస పోయిన 

తన వడిలో భద్రంగా దాచుకుంటుంది.రచన.

కడెం.ధనంజయ చిత్తలూరు మండలం: శాలిగౌరారం

జిల్లా:నల్గొండ.