బస్ డిపో ధ్యేయంగా దీక్ష
తిరుమలగిరి 06 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్ :- తిరుమలగిరి గ్రామములో సబ్బండ కులాల రిలే నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బస్ డిపో సాధన కమిటీ కన్వీనర్ కడెం లింగయ్య మాట్లాడుతూ తిరుమలగిరిలో బస్ డిపో ఏర్పాటు చేయాలని అందుకు డిపో నిర్మాణానికి అవసరమైన భూమి ఇవ్వడానికి కొంతమంది దాతలు ముందుకు వచ్చినప్పటికీ బస్ డిపో ఏర్పాటు కోసం గత కొంతకాలంగా ఇక్కడ తిరుమలగిరిలో బస్ డిపో ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఈ ప్రాంత శాసనసభ్యులకు జిల్లా మంత్రులకు ఆర్టీసీ అధికారులకు సంబంధిత శాఖ మంత్రులకు విజ్ఞాపన చేయడం జరిగిందని తెలిపారు తిరుమలగిరి మండల ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష అయినా బస్ డిపో నిర్మాణమీద వెంటనే ఇక ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని తెలిపారు ఈ ఉద్యమాన్ని బస్ డిపో ఏర్పాటు చేసేంతవరకు మండలంలోని సబ్బండ వర్గాల ప్రజలను అన్ని రాజకీయ పార్టీలను ప్రజాసంఘాలను యువజన సంఘాలను స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని పోయి తిరుమలగిరిలో బస్ డిపో ఏర్పాటు అయ్యేంతవరకు కూడా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని చేపడతామని తెలిపారు ప్రభుత్వం వెంటనే పునరాలో సించుకొని తిరుమలగిరిలో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని వెంటనే బస్ డిపో ఏర్పాటు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సంకేపల్లి రఘునందన్ రెడ్డి . మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్. తిరుమలగిరి గ్రామ మాజీ సర్పంచ్ కందుకూరి సోమయ్య ఎస్.కె పాషా డిపో సాధన కమిటీ నాయకులు. బిజెపి పార్టీ జిల్లా నాయకులు దీని దయాల్. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రాంప్రభు ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కందుకూరి సోమన్నమాదిగ. సిపిఎం జిల్లా నాయకులు కే యాదగిరి రావు పోరెల్ల లక్ష్మయ్య బీసీ సంఘం మండల బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వంగరి బ్రహ్మం మాల మహానాడు తిరుమలగిరి మున్సిపాలిటీ అధ్యక్షులు గంట లక్ష్మణ్ మండల అధ్యక్షులు గంట సందీప్. మద్దెల ప్రభుదాస్, బీసీ సంక్షేమ సంఘం తిరుమలగిరి పట్టణ అధ్యక్షులు ముద్రంగుల యాదగిరి BJP పార్టీ తిరుమలగిరి మండల నాయకులు కొండ సోమయ్య పాల బిందెల వీరయ్య సిఐటి నాయకులు పానగంటి శీను తోపుడుబండ్ల సంఘం అధ్యక్షులు దాసరి ప్రకాష్ బిఆర్ఎస్ నాయకులు గఫార్ బిఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి షకిల్ మిట్టపల్లి లక్ష్మి సిపిఎం పార్టీ నాయకురాలు. వేల్పుల లింగయ్య చిలకల రమేష్. పోతరాజు వెంకటయ్య వంగూరు మల్లయ్య నలుగురి ప్రకాష్. కొంపెల్లి రామ్మూర్తి గౌడ్ కొంపెల్లి బుచ్చిమల్లు ప్రవీణ్ సుభాష్ శేఖర్. ముద్దంగుల యాదగిరి కడారి లింగయ్య ఉప్పలయ్య వెంకన్న పయ్యావుల వెంకన్న.