44 కార్మిక సంక్షేమ చట్టాలను యధా విధంగా పొందుపరిచి కార్మికులకు రక్షణ కల్పించాలి .
భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు పటేల్
ఖమ్మం టౌన్ రాడ్ బైండింగ్ మేస్త్రీల సమావేశం స్థానిక బల్లేపల్లి ఇఫ్టూ జిల్లా ఆఫిసులో కోట.రాజు అధ్యక్షతన జరిగింది . ఈ సమావేశం లో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు పటేల్ పాల్గొని మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నా 44 కార్మిక సంక్షేమ చట్టాలలో 29 చట్టాలను 4 లేబర్ కొడ్స్ గా మార్చివేసి మిగతా 15 చట్టాలను అడ్రస్ లేకుండా చేశారని ఆరోపించారు . ఈ 4 లేబర్ కోడ్ లను కార్మిక సమ్మే పై అనేక ఆంక్షలు మరియు 08 గంటల కన్నా అధిక గంటలు పని చేయొచ్చుకొవచ్హనే నిబంధన ఫిక్షెడ్ టర్మ్ ఎంప్లొయీమెంట్ వంటి కార్మిక వ్యతిరేక విధానాలను ఈ 04 లేబర్ కోడ్ లను పొందుపరిచారు .
08 గంటల పని స్థానంలో 12 గంటల పని చేయొచ్చని నిబంధన తీసుకొచ్చిన తర్వాత అడ్డు అదుపు లేకుండా కార్మిక వర్గాన్ని ధొచుకొవటానికి అవకాశం కల్పించింది . 08 గంటల పని ధినము నిబంధన ఉన్నవాడు కూడ యాజమన్యం అధిక గంటల పని చేయించిన చరిత్ర ఉంది . సెలవలకు కూడ నోచుకోని దయనీయ స్థితి కార్మిక వర్గానికి ఏర్పడబోతుందనీ అన్నారు . ఈ సమావేశంలో నాయకులు గాజుల మొహాన్ రావ్ , గొసుల అశోక్ , మాలొత్ రూపుల , కుంట్ల సతీశ్ , బి.హనుమంతరావు , ఎన్.అవినాష్ , గూడ వెంకటేశ్వర్లు , శ్రీను , నవీన్ తదితరులు పాల్గొన్నారు .