బూర నర్సయ్య గౌడ్ గెలుపు తథ్యం దీనదయుల్
తిరుమలగిరి 29 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బూర నర్సయ్య గౌడ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వై దీనదయూళ్ అన్నారు ఆదివారం నాడు తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఐదు ఆరవ వార్డులో మాలిపురం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజల్ని కలుస్తూ ప్రధానమంత్రి మోడీ తిరిగి మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరారు ప్రతి గ్రామంలో అందరికీ ఉచిత బియ్యము ప్రతి గ్రామానికి ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్లు ఉచిత గ్యాస్ రైతులకు కిసాన్ సమృద్ధి యోజన కింద 6000 రూపాయలు ఆర్థిక సహాయం తదితర కేంద్ర పథకాలు అమలు అవుతాయని చెప్పారు దేశ రక్షణ కోసం రాజీ పడకుండా అవినీతి లేకుండా నేరుగా ప్రజలకు సహకారం అందిస్తూ ప్రజల్ని అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ ఆదర్శ ప్రభుత్వ నడిపిస్తున్నారని తిరిగి బిజెపిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మేడబోయిన యాదగిరి మేకల శ్రీనివాస్ రెడ్డి మూల వెంకన్న ఎల్సోజు సోమయ్య చింతకాయల వీర స్వాములు వంగరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు